అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకడానికి కారణమిదే.. ఆ ఒక్క నిమిషమే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ భారిన పడటంతో ఆ ఘటన దేశంలో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రపంచమంతా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇక భారతదేశంలో రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇక అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ కి వైరస్ సోకింది అనగానే ఇప్పుడు అన్ని వర్గాల వారిలో మరింత ఆందోళన పెరుగుతోంది. అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అమితాబ్ వైరస్ భారిన పడటానికి కారణం ఏమిటనే సందేహం హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

#AmitabhBachchan : ఆ ఒక్క నిమిషమే Amitabh Bachchan ప్రాణాల మీదకు తెచ్చింది! || Oneindia Telugu
ఇప్పటికే అనారోగ్య సమస్యలు..

ఇప్పటికే అనారోగ్య సమస్యలు..

77 ఏళ్ల వయసు కలిగిన అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలు అనారోగ్య పరిస్థితులతో సతమతమవుతున్నారు. 1982లో కూలీ సినిమా షూటింగ్స్ లో ఒకసారి ప్రమాదానికి గురైన అమితాబ్ అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉండడంతో ఆయన క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని..

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని..

కొన్ని రోజుల క్రితమే అమితాబ్ బచ్చన్ కొన్ని చెకప్ ల కోసం తన పర్సనల్ డాక్టర్లను సంప్రదించారు. వారం గడవకముందే ఆయన కరోనా వైరస్ భారిన పడటం ఆందోళన కలిగించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని తెలియగానే వెంటనే పరీక్షలు నిర్వహించగా శనివారం వచ్చిన రిపోర్ట్స్ లో కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు అసలు కరొనా వైరస్ ఎలా సోకింది అనేది హాట్ టాపిక్ గా మారింది.

కరోనా వచ్చింది అక్కడే..

కరోనా వచ్చింది అక్కడే..

ఇటీవల అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా క్రోర్‌పతి షో ఆడిషన్స్ కోసం ముంబైలోని ఒక స్టూడియోకు వెళ్లగా అక్కడ కరోనా సోకి ఉంటుందనే తెలుస్తోంది. అసలైతే అమితాబ్ లాక్ డౌన్ మొదలైన రోజు నుంచే ఇంటి బయటకు రాలేదు. ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా జనాలకు జాగ్రత్తలు చెబుతూ.. తనదైన శైలిలో పలు సేవా కార్యక్రమల్లో పాల్గొంటూ కీలక పాత్ర పోషించారు.

ఆ ఒక్క నిమిషం..

ఆ ఒక్క నిమిషం..

ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. సాధారణంగానే జాగ్రత్తలు తీసుకునే అమితాబ్ KBC ఆడిషన్స్ లో మాస్క్ ని కొంత సేపు వేసుకోలేదని తెలుస్తోంది. కేవలం ఒక నిమిషం మాస్క్ తీయడంతో ఆ గ్యాప్ లోనే వైరస్ సోకిందని టాక్ వస్తోంది. మాస్క్ ధరించి ఉండి ఉంటే అమితాబ్ వైరస్ భారిన పడేవారు కాదట. ఇక అనుమానం వచ్చిన వెంటనే అమితాబ్, అభిషేక్ వైద్య పరీక్షలకు వెళ్లడం వలన పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా వైరస్ ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చని ప్రస్తుత ఘటనలను చూస్తే అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X