జయప్రకాష్ రెడ్డికి గుండెపోటు రావడానికి అసలు కారణమిదే.. బయటపడ్డ అసలు విషయం

సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం ప్రతి ఒక్కరినీ ఎంతగానో బాధించింది. తోటి నటీనటులు ఆయన మరణవార్తని మర్చిపోలేకపోతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సైతం జయప్రకాష్ మృతి చెందడం తీరని లోటు అన్నారు. అయితే ఈ సీనియర్ నటుడికి అకస్మాత్తుగా మృతి చెందడానికి అసలు కారణం తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమేనని తెలుస్తోంది.

అలా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు

అలా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు

నెగిటివ్ రోల్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన జయప్రకాష్ రెడ్డి కమెడియన్ గా కూడా అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సరే తనదైన శైలిలో చేసి మెప్పించే సత్తా ఉన్న జయప్రకాష్ స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాటకాలు అంటే ఆయనకు అమితమైన ఆసక్తి.

తీవ్ర ఒత్తిడికి లోనవ్వడంతో..

తీవ్ర ఒత్తిడికి లోనవ్వడంతో..


తోటి నటీనటులతో ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆప్యాయంగా ఎవరైనా పిలిస్తే సొంత మనిషిలా అభిమానించే వారు. ఇక ఇంత సడన్ గా జయప్రకాష్ కి గుండెపోటు ఎందుకు వచ్చింది అనే అనుమానం ప్రతి ఒక్కరిలోని అనేక రకాల సందేహాలను కలిగించింది. అందుకు కారణం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమేనని తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితమే హార్ట్ లో స్టంట్

కొన్ని నెలల క్రితమే హార్ట్ లో స్టంట్

జయప్రకాష్ కి కొన్ని నెలల క్రితమే హార్ట్ లో స్టంట్ వేశారు. అనంతరం ఆయన మెల్లగా కొలుకున్నారు. హార్ట్ పేషేంట్ కావడంతో వీలైనంత వరకు ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ఇటీవల జయప్రకాష్ కుటుంబంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృబించినట్లు తెలుస్తోంది.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
కరోనా వల్ల ఒత్తిడి..

కరోనా వల్ల ఒత్తిడి..


జేపీ భార్యతో పాటు కుమారుడు కూతురు కోడలు అలాగే వారి పిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడినట్లు సమాచారం. అయితే జయప్రకాష్ కి నెగిటివ్ వచ్చింది. కుటుంబంలో కరోనా భయానికి గురి చేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని బాత్రూంలోనే కుప్పకూలి అక్కడే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఇక ఆయన అంత్యక్రియలకు ఎక్కువమంది హాజరు కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X