త్రివిక్రమ్, పవన్‌తో సినిమా చేయకపోవడానికి కారణమిదే.. ఆ ఒత్తిడి తట్టుకోలేకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే.. అది త్రివిక్రమ్, పవన్ కాంబో అనే చెప్పాలి. చేసింది మూడు సినిమాలే అయినా వారి స్నేహమే కాంబినేషన్ పై అంచనాల డోస్ ను పెంచుతుంది. అయితే వీరి కలయికలో మరో సినిమా రావాలని అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటున్నారు. కానీ త్రివిక్రమ్ చేయకపోవడానికి ఒక ప్రధానమైన ఒత్తిడి ఉందట. ఆ కారణంగానే రిస్క్ చేయడం లేదని తెలుస్తోంది.

ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే..

ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే..

జల్సా సినిమాతో వీరు ఏ రేంజ్ లో హిట్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా గనక ఇప్పుడు విడుదలయ్యి ఉంటే బాక్సాఫీస్ వద్ద గత రికార్డులన్ని కూడా మాయమయ్యెవి. ఇక ఎప్పుడైనా సరే టీవీలలో టెలిక్యాస్ట్ అయినప్పుడు రేటింగ్స్ కూడా బాగానే అందుకుంటుంది. ఇక ఆ తరువాత పవన్ తీన్ మార్ సినిమాను త్రివిక్రమ్ మాటలు అందించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

అప్పుడే ఈ కాంబో రేంజ్ పెరిగింది

అప్పుడే ఈ కాంబో రేంజ్ పెరిగింది

ఇక అత్తారింటికి దారేది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఆఖరికి సగం సినిమా ఒరిజినల్ ప్రింట్ లీక్ అయినప్పటికీ కలెక్షన్స్ విషయంలో హవా ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడే పవన్, త్రివిక్రమ్ కాంబోపై అంచనాల డోస్ మరో స్థాయికి వెళ్లింది.

ఆ ప్రభావం ఎక్కువగానే పడింది

ఆ ప్రభావం ఎక్కువగానే పడింది

ఒక సినిమాకు అంచనాలు పెరగడం అనేది కొన్నిసార్లు ఉపయోగమే అయినప్పటికీ మరికొన్ని సార్లు అదే పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అలాగే వీరి మూడవ సినిమాపై కూడా ఆ ప్రభావం కాస్త ఎక్కువగానే పడింది. త్రివిక్రమ్, పవన్ తో కలిసి చేసిన మూడవ సినిమా అజ్ఞాతవసి. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అసలు కారణం ఇదే..

అసలు కారణం ఇదే..

ఇక పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యంగా వీరి కలయికపై పెరిగే అంచనాలే అని టాక్ వస్తోంది. ఎంత మంచి స్టోరీ సెట్టయినా కూడా అభిమానులు కథ కథనం కన్నా కూడా అంతకుమించి అనేలా మరేదో కావాలని అనుకుంటారు. ఇలాంటప్పుడు ఊహలను అందుకోవడం కష్టమైన పనే. అందుకే ఆ ఆలోచన ఒత్తిడి తట్టుకోలేక మాటల మాంత్రికుడు పవన్ ను డైరెక్ట్ చేయలేకపోతున్నాడు.

ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో త్రివిక్రమ్

ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో త్రివిక్రమ్

ఇక నెక్స్ట్ పవన్ నుంచి రాబోతున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు మాత్రం త్రివిక్రమ్ బ్యాక్ గ్రౌండ్ నుంచే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ సగం వరకు త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే సినిమా తెరకెక్కుతుందని టాక్. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా ఈ దర్శకుడు చాలా మార్పులు చేసినట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X