బెడిసికొట్టిన RGV ప్లాన్.. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తు ఫ్రీగా పవర్ స్టార్.. ఇది నిజమా? వ్యూహమా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి పవర్ స్టార్ సినిమా ట్రైలర్ ని సిద్ధం చేశారు. కానీ రాత్రికి రాత్రే ట్రైలర్ లీక్ అయ్యింది అంటూ వర్మ ట్వీట్ చేయడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త వ్యూహాలు ఏమైనా వేస్తున్నారా లేక నిజంగానే పవర్ స్టార్ ట్రైలర్ న్ లీక్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో వర్మ ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు.
Recommended Video

ట్రైలర్ లీక్..
పవర్ స్టార్ ట్రైలర్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు గత వారం నుంచి వర్మ తీవ్ర స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ ని యూ ట్యూబ్ లో కాకుండా తన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పిన వర్మ 25రూపాయల రేటును కూడా ఫిక్స్ చేశాడు. కానీ ఆ ట్రైలర్ రాత్రి ఒక వెబ్ యూ ట్యూబ్ ఛానెల్ లో దర్శనమిచ్చింది.

డబ్బులు వెనక్కి ఇచ్చేస్తూ..
ఇక మరో దారి లేక ఇప్పుడు యూ ట్యూబ్ లో ఫ్రీగానే రిలీజ్ చేటున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇక ట్రైలర్ కోసం అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన ఆర్జీవి తమ ఆఫీస్ లోనే ఒకరు ట్రైలర్ ని లీక్ చేసి ఉంటారని చెబుతున్నారు. ఇక అందుకు చర్యలు తీసుకుంటానని చెబుతున్న ఆర్జీవి మరోసారి ఈ విషయం వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ప్రమోషన్స్ స్కెచ్..
ఇక ట్రైలర్ లీక్ అయ్యింది నిజమేనా లేక వర్మ ఈ విధంగా కొత్త తరహాలో ప్రమోషన్స్ స్కెచ్ వేస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. సినిమాకు 250వరకు రేట్ ఫిక్స్ చేసి షాక్ ఇచ్చిన వర్మ ట్రైలర్ కి కూడా 25రూపాయలు సెట్ చేయడం కొంత టూ మచ్ అనిపించింది. అయితే ట్రైలర్ కోసం ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్లే వర్మ ఈ విధంగా స్టంట్ వేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

సినిమా కోసమే ట్రైలర్ లీక్?
సాధారణంగా సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే ట్రైలర్ ద్వారానే జరుగుతుంది. ట్రైలర్ క్లిక్కయితే ఆటో మేటిక్ గా కలెక్షన్స్ పెరుగుతాయి. ఇక వర్మ ఫిక్స్ చేసిన రేటు ఇప్పటికే మరి ఎక్కువ అనిపిస్తోంది. దీంతో 25రూపాయలు పెట్టి మళ్ళీ సినిమా కోసం అంత పెట్టాలా అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే వర్మ ట్రైలర్ ని ఫ్రీగా వదిలి ఫుల్ సినిమాతో కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ ప్లాన్ ఎంతవతకు క్లిక్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











