నిజం సినిమాలో రాశి హాట్ రోల్ చేయడానికి కారణమిదే.. డైరెక్టర్ తేజ మోసం చేశాడట!
తెలుగు హీరోయిన్స్ లలో మర్చిపోలేని అందాల నటి రాశి. తన స్వచ్ఛమైన నవ్వుతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ భామ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. తమిళ్ కన్నడ మలయాళం అనే కాకుండా హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

అప్పటి వరకు బిజీ బిజీగా..
మొదట బాల నటిగా వెండితెరకు పరిచయమైన రాశి ఆ తరువాత 1997 నుంచి హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో బిజీ బిజీగా కొనసాగింది. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన ఈ తెలుగమ్మాయి తమిళ్ లో మంచి బాక్సాఫీస్ హిట్స్ ని అందుకుంది. అయితే రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఐదేళ్ల తరువాత మెల్లమెల్లగా డౌన్ అయ్యింది.

నిజం సినిమా క్యారెక్టర్..
2003లో వచ్చిన మహేష్ బాబు నిజం సినిమాలో రాశి చేసిన పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అంతకుముందు వరకు పక్కింటి అమ్మాయిలా హోమ్లీగా కనిపించిన రాశి ఆ పాత్రలో బోల్డ్ గా దర్శనమిచ్చింది. హాట్ నెస్ డోస్ పెంచి అందరికి షాకిచ్చిన రాశి ఎందుకు ఇలాంటి పాత్రలు చేసింది అనే కామెంట్స్ వచ్చాయి.

అలా చేయడానికి కారణం..
నిజం సినిమాలో రాశి ఆ విధంగా కనిపించడానికి కారణం రాశికి దర్శకుడు చెప్పినట్లుగా తీయలేదట. ముందు దర్శకుడు ఒక లవ్ స్టోరీ అని చెప్పి ఆ తరువాత పూర్తిగా ఆ పాత్ర శైలిని మార్చేసి మోసం చేశారట. పలు ఇంటర్వ్యూలలో కూడా రాశి ఆ పాత్ర వెనుక జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పింది. షూటింగ్ మొదటి రోజే వెళ్లిపోదామనుకున్న రాశి అడ్వాన్స్ తీసుకొని కమిట్ అయిన పాత్రను అలా చేయకుండా వెళ్లిపోతే బావుండదు అని ఇష్టం లేకపోయినా ఆ పాత్రను చేసినట్లు వివరణ ఇచ్చింది.
Recommended Video

ఆ పాత్ర చేసిన తరువాత..
నిజం సినిమాలో ఒక్కసారిగా బోల్డ్ గా కనిపించడంతో అందరు షాక్ అయ్యారట. రాశికి ఫోన్ చేసిన కొంతమంది స్టార్స్ నటనపరంగా ఆ పాత్ర చాలా బావుందని మెచ్చుకున్నారట. కానీ కొందరు అభిమానులు మాత్రం అలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నారని తనతో చెప్పినట్లు రాశి గత ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే భవిష్యత్తులో మాత్రం 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా లాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిపిస్తానని చెబుతోంది ఈ అందాల రాశి.


Click it and Unblock the Notifications











