ఆ పాత్ర కోసం Balayya చేసిన అతి పెద్ద సాహసం.. 10 రోజుల పాటు తిండి తినకుండా.. సినిమా ఏంటో తెలుసా?
నందమూరి నటిసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆరు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి అభిమానులను అలరించారు. అయితే ఆయన ఓ పాత్ర కోసం పెద్ద సాహసమే చేశారు. అంతే కాదు ఆ పాత్ర కోసం ఏకంగా పది రోజుల పాటు అన్నం కూడా తినలేదట. ఆ సంగతేంటో చూద్దాం..
పనే దైవం.. పనే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ముందుంటారు బాలకృష్ణ. క్రమశిక్షణ, చేస్తున్న పనిపట్ల నిబద్ధతే ఆయనే బలం. తండ్రి ఎన్టీఆర్ నుంచి ఈ గుణాలను పుణికిపుచ్చుకున్నారు. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోగా ఎదిగారు.

ప్రయోగాలకు సై: కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు.. ప్రయోగాలకు ఎప్పుడూ బాలయ్య ముందుంటారు. మాస్ అండ్ గ్లామరస్ హీరోగా ఇమేజ్ దక్కించుకుని కెరీర్ లో దూసుకెళ్తున్న ఆయన ఓ సమయంలో భైరవద్వీపం వంటి జానపద చిత్రాన్ని చేసి అభిమానులను షాక్ అండ్ సర్ ప్రైజ్ కు గురిచేశారు. సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కళకళలాడేలా చేసింది.
కూరూపిగా సాహసం: ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ భైరవద్వీపం కథ ఎంచుకని సినిమా చేయడం ఒక ఎత్తైతే, అందులో కురూపిగా నటించడం అతి పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ హీరోలు ఎవరూ అలాంటి పాత్ర వేయడానికి సాహసం చేయరు. అయినా అప్పటికే రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ , వంటి మాస్ చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య. మరి అలాంటి సమయంలో దర్శకుడు సింగీతం.. భైరవద్వీపం స్టోరీని బాలకృష్ణకు వినిపించారు. అంటే కథ వినగానే నచ్చి ఏం మాట్లాడకుండా ఒకే చెప్పేశారట. అలానే సినిమాలో కురూపిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇంకోరైతే నో చెప్పేవారు: మాస్ హీరో లాంటి బాలకృష్ణ కురూపి పాత్రలో యాక్ట్ చేయడం నిజంగా అతి పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో బాలయ్యకు గ్లామర్ హీరో ఇమేజ్ తో స్టార్ కథానాయకుడిగా ఉన్నారు. ఆయన కాకుండా మరో హీరో అయితే.. నో చెప్పేసేవారు. లేదంటే ఒకటి రెండు సార్లైనా ఆలోచించేవారేమో. కానీ బాలయ్య అలా చేయలేదు. ఆయనకు డైరెక్టర్, స్టోరీపై నమ్మకం చాలా ఎక్కువ.
పది రోజులు భోజనం లేకుండా: ఇంకా చెప్పాలంటే.. కురూపిగా కనిపించే సీన్స్ చిత్రీకరించేటప్పుడు మేకప్ వేయడానికి కనీసం 2 గంటలు పట్టేది. ఒక్కోసారి మేకప్ వేశాక.. సాయంత్రం వరకు తీయడానికి వీలయ్యేది కాదు. కానీ భోజనం చేయాలంటే మేకప్ తీయాల్సిందే. ఒకవేళ మేకప్ తీస్తే మళ్లీ రెండు గంటలు సమయం వృథా అయ్యేది. అందుకే సమయం వేస్ట్ కాకూడదని ఆయన దాదాపు పది రోజుల పాటు కేవలం జ్యూస్‌లు తాగారు. అన్నం తినలేదు.

ముళ్లు, రాళ్లు గుచ్చుకున్నా: ఇక ఇదే సినిమాలో కురూపి శాపాన్ని హీరో తల్లి తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం గురించి చెప్పగానే.. కేఆర్ విజయ కూడా ఒప్పేసుకున్నారు. అయితే తన తల్లి శాపం తీసుకుందని బాలయ్య తెలుస్తుంది. దీంతో బాలయ్య.. కొండలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. అయితే బాలయ్య నిజంగానే పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీళ్లలో ఉన్న ముళ్లు కాలులో దిగిపోయాయి.
రాళ్లు బాగా గుచ్చుకుపోయాయి. అయినా బాలయ్య తగ్గేదే లే. అవేవీ పట్టించుకోలేదు. ఇక బాలయ్య కురూపిగా కనిపిస్తారని అభిమానులకు ఎవ్వరికీ తెలీదు. థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూసి షాక్ అయిపోయారు. సినిమా సూపర్ హిట్. ఈ మొత్తం విషయాన్ని దర్శకుడు సింగీతం గతంలో చెప్పారు. ఇకపోతే ఈ చిత్రం త్వరలోనే 4కేలో రీరిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











