twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెజవాడ' ప్రీమియర్ షో టాక్ ఏంటి?

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ, నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన బెజవాడ చిత్రం ప్రివ్యూలను ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న రాత్రి వెయ్యటం జరిగింది. చూసిన వారి టాక్ ప్రకారం ఈ చిత్రం బెజవాడ చిత్రం రెండు కుటుంబాల మధ్యన జరిగే రివేంజ్ స్టోరీ. విజయవాడని నేపధ్యంగా తీసుకున్నారు కానీ నిజానికి ఈ కథ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగినా పెద్ద తేడా ఉండదు. చాలా కాలంగా సిటీలో ఉండే లోకల్ పొలిటీషన్స్ వైరం ఈ సినిమాకు కీలకం. అయితే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, సీన్స్ విజయవాడ నేటివిటిలోని కొందరని రిసెంబల్ చేసేలా తీసుకున్నారు. ప్రత్యేకమైన ప్రాంతంలోని వారి మనోభావాలని, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ఈ చిత్రంలో ఎక్కువ కనపడిందని షో చూసిన కొందరు కామెంట్స్ చేయటం గమనార్హం.

    రెగ్యులర్ రివేంజ్ స్టోరీనే తప్ప మరొకటి కాదని, మాస్ కు పట్టే అవకాశ ముందని మరికొందరు అంటున్నారు. బోయపాటి శ్రీను తరహాలో హింస ని బాగా గ్లోరిఫై చేసి చూపాడని సినిమా ఎలాగున్నా దర్శకుడుకి మాత్రం పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాసం ఉందని కొందరు సిని పెద్దలు అనుకోవటం జరిగింది. ఫస్టాప్ లో నాగచైతన్య పెద్దగా కనపడడు. సెకండాఫ్ లో అతను పూర్తిగా తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అయితే యాక్షన్ పరంగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందంటున్నారు. నాగార్జున శివతో పోల్చి చూసే ప్రయత్నం మాత్రం అనవసరం అని తెలుస్తున్నారు.

    English summary
    The first show of Bejawada was held tonight at Prasad labs in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X