twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆధిపత్యపోరాటం(బెజవాడ ప్రివ్యూ)

    By Srikanya
    |

    గత కొంత కాలంగా సంచలనాలకు కేంద్రమై నిలిచిన రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడ ఈ రోజు విడుదలవుతోంది. నాగార్జున శివ తో తన కెరీర్ ప్రారంభించిన వర్మ ఈ చిత్రంతో ఆయన కుమారుడు నాగచైతన్యకు యాక్షన్ ఇమేజ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ చేసిన ప్రయత్నం ఈ చిత్రం. ఈ చిత్రంలో నాగచైతన్య శివకృష్ణగా కనిపిస్తాడు. అతనో కాలేజ్ స్టూడెంట్. అతనికి పుట్టిపెరిగిన బెజవాడ అంటే విపరీతమైన ప్రేమ. పుట్టిన గడ్డపై అభిమానాన్ని అణువణువునా నింపుకొన్న ఈ కాలేజీ కుర్రాడు అక్కడ పరిస్ధితులని చూసి తట్టుకోలేకపోతాడు. ఎవరైనా స్వార్థం కోసం తన వూరిని, అక్కడి పరిస్థితుల్ని ఉపయోగించుకోవాలని చూస్తే ఎదురు తిరిగి నిలబడతాడు. ఆ నగరంలోని ఓ వర్గానికి నాయకుడు కాళిప్రసాద్‌ (ప్రభు). అతనికీ, శివకృష్ణకీ మధ్య ఏం జరిగింది? విజయకృష్ణ (ముకుల్‌దేవ్‌), జయకృష్ణ (అజయ్‌), శంకరప్రసాద్‌ (అభిమన్యుసింగ్‌) అనే వ్యక్తులు శివకృష్ణ చుట్టూ ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించారు? ఆ సమస్యలకు అతను ఎలాంటి ముగింపునిచ్చాడు? గీతాంజలి(అమలాపాల్‌) అనే యువతితో ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

    దర్శకుడు వివేక్ కృష్ణ మాట్లాడుతూ ..యాక్షన్‌, భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మాస్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుడిగా తను తెరపై కనిపించే తీరు అందరికీ నచ్చుతుంది. చైతన్య-అమలాపాల్‌ మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యువతరాన్ని మెప్పించేలా ఉంటాయి. బెజవాడ నేపథ్యం ఒక కీలక పాత్రలా చిత్రానికి ఉపయోగపడిందని అన్నారు.

    సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్‌
    నటీనటులు: నాగచైతన్య, అమలా పాల్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
    నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు
    దర్శకత్వం: వివేక్‌ కృష్ణ
    విడుదల: గురువారం.

    English summary
    RGV's latest Bejawada releasing today with positive note.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X