twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టుకు 'బెజవాడ' నిర్మాత .. పాస్‌పోర్టు సీజ్‌

    By Srikanya
    |

    Kiran Kumar Koneru
    హైదరాబాద్ : సినీ నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం హాజరుపరిచారు. 'బెజవాడ' చిత్ర నిర్మాణానికి గాను 2011లో బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి తీసుకున్న రూ.కోటి మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో ఇతనిపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది.
    ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరు పరిచారు. రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తు తీసుకుని కిరణ్‌కుమార్‌కు కోర్టు బెయిలు మంజూరు చేసింది. అతని పాస్‌పోర్టు సీజ్‌ చేసింది.

    వివరాల్లోకి వెళితే... సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పును చెల్లించలేదన్న ఫైనాన్షియర్ ఫిర్యాదు మేరకు ప్రముఖ నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మణికొండలో నివసించే కిరణ్‌కుమార్ 2011లో నాగచైతన్య హీరోగా బెజవాడ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్ర నిర్మాణం కోసం ప్రసాద్ ల్యాబ్స్ ఫైనాన్స్ నుండి రూ. కోటి రుణం తీసుకున్నాడు.

    అయితే చిత్రం సరిగా ఆడకపోవడంతో నష్టపోయి సకాలంలో అప్పును తీర్చలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ ఇచ్చిన ప్రసాద్ ల్యాబ్స్ కోర్టును ఆశ్రయించింది. రెండుసార్లు నోటీసులు జారీచేసినప్పటికీ హజరుకాకపోవడంతో అతనిని అరెస్ట్ చేసి హజరుపర్చాలని కోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. బంజారాహిల్స్ పోలీసులు శనివారం మణికొండలో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే కిరణ్‌కుమార్ అస్వస్థతకు గురికావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    English summary
    Koneru Kiran Kumar, the producer of Naga Chaitanya’s Bejawada was arrested by Hyderabad Police a short while ago. He reportedly took finance of 1 Crore from Prasad Labs for Bejawada movie. The film went on to become a disaster and Kiran Kumar did not repay the amount to Prasad Labs. After several attempts, a case was filed on him by Prasad Labs. The court had issued summons twice to him to appear before the court which was ignored by Kiran Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X