హైకోర్టులో 'బెజవాడ రౌడీలు'
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న"బెజవాడ రౌడీలు" చిత్రం వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరుకుంది. టైటిల్ ని మార్చమని అడగటంతో ఆయన మార్చకపోవటంతో విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి అనే న్యాయవాది హైకోర్టుకి వెళ్ళారు. వర్మ బెజవాడ రౌడీలు సినిమా టైటిల్‌ను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా టైటిల్ ఉందని ఆరోపించారు.
హైకోర్టు ఈ కేసు విషయమై సెన్సార్ బోర్డు లీగల్ కౌన్సిల్ ని వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వమని ఆదేశించింది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం టైటిల్ తన చిత్ర కథకు కరెక్టుగా సరిపోతుందని వాదిస్తున్నారు. బెజవాడ రౌడీలు సినిమా టైటిల్‌పై మొదటి నుంచీ వివాదం చెలరేగుతూనే ఉన్నది. టైటిల్ మార్చాలని విజయవాడలో ఆందోళనలు కూడా జరిగాయి. రామ్ గోపాల్ వర్మకు హెచ్చరికలు కూడా వెళ్లాయి. అయితే ఆయన టైటిల్ మార్చడానికి ఇష్టపడకపోగా బెదిరింపులకు లొంగలేదు. కాగా, బెజవాడ రౌడీలు రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారు.


Click it and Unblock the Notifications











