దిగొచ్చిన వర్మ-బెజవాడ నుంచి ‘రౌడీలు’ కట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు దిగొచ్చాడు. ప్రజలు, రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి తన సినిమాలో మార్పులు చేర్పులు చేశారు. నాగచైత్య హీరోగా తను నిర్మిస్తున్న 'బెజవాడ రౌడీలు" సినిమా టైటిల్ నుంచి 'రౌడీలు" అనే పదాన్ని తొలగించి 'బెజవాడ"గా మార్చాడు.
ఈ సినిమా టైటిల్ పై తొలి నుంచి జెజయవాడ వాసులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్రమైన బెజవాడను... వర్మ రౌడీలవాడ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ దీక్షలు, ధర్నాలు లాంటి ఆందోళన కార్య్రకమాలతో నిరసన వ్యక్తం చేశారు. ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా నాకు అనవసరం, నా సినిమా నా ఇష్టం ఇంతకాలం మొండిగా వ్యవహరించిన ఆయన...చివరకు కాంప్రమైజ్ కాక తప్పలేదు. ఈ సినిమాలో నాగచైతన్య సరనన అమలాపౌల్ నటిస్తుండగా, వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
bejawada rowdilu ram gopal varma naga chaitanya amala paul బెజవాడ రౌడీలు రామ్ గోపాల్ వర్మ బెజవాడ నాగచైతన్య అమలా పౌల్


Click it and Unblock the Notifications