కాజల్ పెళ్లిపై మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ కారణంగా మిస్ చేసుకోలేను
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు కాబోయే భర్త గౌతమ్ గురించి స్పెషల్ గా కథనాలు వెలువడుతున్నాయి. అతని బయోడేటా మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతుండగా ఇప్పుడు కాజల్ పెళ్లిపై బెల్లంకొండ శ్రీనివాస్ ఒక వివరణ ఇచ్చాడు. ఇదివరకే ఆమెకు బెస్ట్ విషెస్ అందించిన విషయం తెలిసిందే..

కాజల్ బెస్ట్ ఫ్రెండ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య రిలేషన్స్ పై నిత్యం రూమర్స్ వచ్చేవే. ఇక అందులో బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. కవచం, సీత సినిమాల్లో జంటగా నటించి మంచి స్నేహితులైన వీరి ఫొటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా కాజల్ పెళ్లిపై ఈ యువ హీరో ఈ విధంగా మాట్లాడాడు.

అందుకు సంతోషిస్తున్నాను..
కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ కంటే కూడా నాకు ఒక మంచి స్నేహితురాలని చెప్పగలను. ఆమె వివాహ వేడుకకు హాజరు కాబోయే అతిధులలో నేను కూడా ఒక ముఖ్య అతిధిని. కాజల్ నా ఇంట్లో మనిషితో సమానం. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. నిజంగా ఆమెకి సరైన భాగస్వామి దొరికాడని అనుకుంటున్నా. నేను అందుకు సంతోషిస్తున్నాను.

పెళ్లి వేడుకను మాత్రం మిస్ చేసుకోలేను
కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ కిచ్లు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పగలను. పెళ్లి కుదిరిన సందర్భంగా వారిద్దరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతనికైతే నేను షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను. కొంత బ్రేక్ తీసుకొని తప్పకుండా కాజల్ పెళ్లికి హాజరు కావాలి. వేరే పనుల వలన తన పెళ్లిని ఏ మాత్రం మిస్ చేసుకోలేను..అంటూ తప్పకుండా పెళ్లికి వెళతానని బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీగా వివరణ ఇచ్చారు.

ముంబైలోనే పెళ్లి వేడుక
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి ఈ నెల 30న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. చాలా సింపుల్ గా ఇంటివద్దనే పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు పెద్దగా సెలబ్రెటీలు కూడా హాజరు కావడం లేదట. కేవలం కాజల్ బంధువులతో పాటు కొద్దిమంది సన్నిహిత సెలబ్రెటీలు మాత్రమే హాజరుకనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











