బెల్లంకొండ 'ఫుల్ మీల్స్..100% మాస్'
బెల్లంకొండ సురేష్ చేయబోయే కొత్త చిత్రం టైటిల్ ఫుల్ మీల్స్ .దానికి ట్యాగ్ లైన్ 100% మాస్.లారెన్స్ దర్సకత్వంలో బెల్లకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించటానకి సిద్దపడుతున్నారు.రెబల్ షూటింగ్ పూర్తవగానే లారెన్స్ ఈ చిత్రం తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.కాంచన డబ్బింగ్ రైట్స్ తీసుకుని లాభపడ్డ బెల్లంకొండ వెంటనే ఈ ప్రాజెక్టుని ఓకే చేసారు.ఇంకా హీరో ఎవరన్నది మాత్రం ఫైనల్ కాలేదు.
లారెన్స్ మాత్రం సునీల్ తో చేస్తే బావుంటుందని ప్రపోజల్ పెడుతున్నాడు.బెల్లంకొండ మాత్రం రవితేజ డేట్స్ తెచ్చే భాద్యత తనదని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ ప్రాజెక్టుకి చెందిన వివరాలును ప్రకటించే అవకాశం ఉంది.ఇక బెల్లంకొండ ప్రస్తుతం వెంకటేష్ తో బాడీగార్డ్ చిత్రం రీమేక్ చేస్తున్నారు.గోపిచంద్ మలినేని ఈ చిత్రం కామిడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు.త్రిష ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడీగా కనపడుతోంది.ఈ చిత్రం పూర్తవగానే వెంటనే ఈ ఫుల్ మీల్స్..100% మాస్ స్టార్ట్ చేసే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











