For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విక్రమ్ ‘సామి’పై దుష్ప్రచారం.. రిలీజ్ కాదని రూమర్లు.. నిర్మాత ఆవేదన

  |

  పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'సామి'. 'సింగం, సింగం 2 , సింగం 3 , పూజా' లాంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన 'సామి' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలచేయనున్నారు.

   సామి రిలీజ్ కాదని రూమర్లు

  సామి రిలీజ్ కాదని రూమర్లు

  ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘సామి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 21న భారీగా థియేటర్లలోకి సామి రాబోతున్నాడు. ఇంతకు ముందు మా సినిమాపై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ సినిమా సెన్సార్ కాదు. రిలీజ్ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్ చేశారు. అన్ని రూమర్లను అధిగమించి సామి సెన్సార్ పూర్తి చేసుకున్నాడు అని తెలిపారు.

   సెన్సార్ ప్రశంసలు

  సెన్సార్ ప్రశంసలు

  సెన్సార్ సభ్యుల ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన ‘సామి' చిత్రాన్ని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా రిలీజ్‌కు కోపరేట్ చేసిన ఎగ్జిబిటర్స్‌కు, అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేలా ఎంకరేజ్ చేసిన నిర్మాతలకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
  ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి దర్శకుడు హరి కారణం అని తెలిపారు.

  విక్రమ్ ఎమోషనల్‌గా

  విక్రమ్ ఎమోషనల్‌గా

  దర్శకుడు హరి గురించి చెప్పాలంటే ఈ సినిమా 2గంటల 34 నిమిషాలు ఉంటుంది. ఆయన సినిమాలు ఎంత స్పీడుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాని విక్రమ్‌గారు ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూశారు. చూసిన వెంటనే విక్రమ్ గారు ఎమోషనలై.. హరి ఇంటికి వెళ్లి హగ్ చేసుకున్నారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

   అపరిచితుడు తర్వాత

  అపరిచితుడు తర్వాత

  ‘‘నా కెరియర్‌లో అపరిచితుడు చిత్రం తర్వాత బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. నాకు మైల్‌స్టోన్ మూవీ ఇచ్చారు..'' అంటూ విక్రమ్ ఎమోషనల్ అయ్యారట. ఈ విషయం తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇప్పటికే రిపోర్ట్స్ నుంచి ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కాబోతోందనే టాక్ వచ్చేసింది. ఇందులో తెలుగుతనం ఉట్టిపడేలా హరిగారు జాగ్రత్తలు తీసుకున్నారు. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. మంచి సినిమా. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు అంటూ క్లీన్ యు సర్టిఫికెట్‌ను వారు జారీ చేశారు అని రామకృష్ణారెడ్డి తెలిపారు.

   దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆర్ఆర్

  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆర్ఆర్

  సింగం సిరీస్‌లో లాస్ట్ చిత్రంకి హరిగారు కాస్త డిజప్పాయింట్ అయినట్లున్నారు. అందుకే ఈ సినిమాలో విక్రమ్‌గారిని పోలీసు పాత్రలో ఆయన తరహాలో అదిరిపోయేలా ఆ సిరీస్ కంటిన్యూ అనేలా తీర్చిదిద్దారు. మదర్ సెంటిమెంట్, పవర్ ఫుల్ మాస్ యాక్షన్, రాక్ స్టార్ దేవిశ్రీ సాంగ్స్, ఆర్ఆర్.. ఇలా అన్నీ హై క్వాలిటీ వేల్యూస్‌తో సెప్టెంబర్ 21న సామి వస్తున్నాడు. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను..'' అని రామకృష్ణారెడ్డి అన్నారు.

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్.

  English summary
  Chiyaan Vikram and Keerthi Suresh's ‘Saamy’ Censor Completed. Gets Clean U Certificate From Censor. Movie Ready to Release On Sep21. Chiyaan Vikram, Keerthy Suresh are the lead pair. Bellam Ram Krishna Reddy as producer for Telugu Saamy version.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X