గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు

By Srikanya

హైదరాబాద్ : ''తొలి సినిమాతో శ్రీనివాస్‌ ప్రేమికుడిగా, మాస్‌ హీరోగా, నిరూపించుకున్నాడు. తర్వాత సినిమా కుటుంబ బంధాలను, ఆప్యాయతలను చూపించేలా ఉండాలనుకున్నాం. బోయపాటి శ్రీను అలాంటి కథతో వచ్చారు. ఈ నెల 27న సినిమాను ప్రారంభిస్తాం. వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని చెప్పారు బెల్లంకొండ సురేష్‌.మొన్నే అల్లుడు శీను తో లాంచ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ అప్పుడే రెండో సినిమాకు సిద్దమవటం ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచేసింది. కుర్రాడు జెట్ స్పీడు మీద ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నాడు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'నా సినిమాలకు కథల ఎంపిక మా నాన్నే చేస్తాడు' అని శ్రీనివాస్‌ గౌరవంతో చెప్పాడు కానీ, నేను అలా కథలు విని, ఫైనల్‌ చేయదల్చుకోలేదు. ఏవైనా సలహాలైతే ఇవ్వగలను. ప్రస్తుతం 'అల్లుడు శీను'ను తమిళ్‌లో డబ్బింగ్‌ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం. బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించే రెండో సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది. హీరోయిన్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు అన్నారు.

Bellamkonda – Boyapati film launch on 27th

ఈ చిత్రాన్నిసైతం బెల్లంకొండ సురేష్ స్వయంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఈ ప్రాజెక్టు ఉందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. అయితే రెండో సినిమాకు సైతం పెద్ద దర్శకుడు కావటంతో ఓపినింగ్స్, ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రంలో అయినా హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రూవ్ చేసుకోవటానికి ఏమన్నా సీన్స్ పెడితే బాగుంటుంది అంటున్నారు సినిమా జనం.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...తొలి సినిమా విడుదలైపోయింది.. ఇక వరుసగా చేసేద్దాం అనుకునే రకం కాదు. అందుకే మళ్లీ ఓ రెండు నెలలు అమెరికా వెళ్లి కొత్త డ్యాన్స్‌లు, యుద్ధ విద్యలు నేర్చుకొని వస్తాను. ఈలోగా నాన్న కథ ఓకే చేస్తాను. వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తాం అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో యువ నాయకులు మధ్య పోటీ చాలా ఉంది. ప్రతి సినిమాకు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తూ ఉంటే ప్రేక్షకుల అలరిస్తూనే ఉంటారు. అందుకే సినిమా చూసి నేను ఇంకా ఏ విషయంలో ఇంకా మెరుగుపడొచ్చు అని చూసుకున్నాను. తర్వాత సినిమాలో అవి లేకుండా చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు.

అలాగే... మాస్‌ ఇమేజ్‌కు కావాల్సిన అన్ని అంశాలు నాలో ఉన్నాయనేది నా నమ్మకం. నా ఫేస్‌, డ్యాన్స్‌, హైట్‌, ఫైట్స్‌ ఇలా అన్నీ ఇటువైపు వచ్చేలా చేశాయి. అయితే మూస పద్ధతిలోకి వెళ్లిపోకుండా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాను. నా తొలి సినిమాకి దర్శకుడిగా వినాయక్‌గారు కావడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రతి సన్నివేశాన్ని చేసి చూపించి నాతో చేయించారు. నాన్న, వినాయక్‌ అంకుల్‌ కలసి నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేశారుఅని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X