బోయపాటితో సినిమా నిజంగానే ఉందా? కవరింగా?

By Bojja Kumar

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శ్రీను' చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదనిపించారు. ఈ సినిమా విడుదల ముందే బోయపాటి శ్రీనుతో అతని రెండో సినిమా కూడా ఖరారైంది.

ఈ చిత్రాన్ని కూడా బెల్లంకొండ సురేషే నిర్మిస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. అయితే ‘అల్లుడు శ్రీను' చిత్రం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ సురేష్ అనుకున్న సమయానికి బోయపాటితో తన కొడుకు రెండో సినిమాను మొదలు పెట్టలేక పోయారని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో బోయపాటి కూడా వేరే హీరోని చూసుకున్నాడు. అల్లు అర్జున్‌కు కథ చెప్పి ఒప్పించారు. వచ్చే ఏడాది మార్చిలో అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

బోయపాటి-అల్లు అర్జున్ సినిమా విషయం మీడియాకు పొక్కడంతో......బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఇక అటకెక్కినట్లే అనే అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ అయోమయానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు బెల్లంకొండ. తన కొడుకు బోయపాటితో రెండో సినిమా చేస్తున్నాడు అనే ఒక హైప్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం బోయపాటితో ప్రకటన కూడా చేయించారు.

Bellamkonda & Boyapati Srinu New Movie details

ఈ నేపథ్యంలో బోయపాటి మాట్లాడుతూ...‘అల్లుడు శ్రీను సినిమాతో సాయి శ్రీనివాస్ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇపుడు నేను చేయబోయే సినిమాకి అతనిలో ఇంకొక వేరియేషన్ చూపించడం కోసం గెటప్ లోగానీ, బాడీలోగానీ, చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నాం. దానికి హీరో ప్రిపేర్ అవుతున్నాడు. ఈ ప్రిపరేషన్ పూర్తవగానే షూటింగ్ స్టార్ట్ చేస్తాం. బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది మంచి మాస్ సినిమా అవుతుంది' అన్నారు.

సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘వినాయక్ గారి దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాను. రెండో సినిమా బోయపాటితో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉంది. బోయపాటి చెప్పిన సబ్జెక్టు చాలా ఇన్స్‌స్పైరింగుగా ఉంది. నా కెరీర్‌కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.

కాగా...ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ వేరే నిర్మాత ద్వారా తన కొడుకు సినిమా చేయించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అయితే సాయి శ్రీనివాస్‌ను నమ్ముకుని బోయాపాటి రేంజికి తగిన భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరి డిసెంబర్లో సినిమా మొదలవుతుందని అంటున్నారు. బెల్లంకొండ సురేష్ ఏం చేయబోతున్నారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X