రభస రిలీజ్ ఇష్యూ: బెల్లంకొండకు బెదిరింపులు

By Bojja Kumar

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రభస' చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం విడుదల కాకుండా వాయిదా పడటం కారణంగా ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నారు.

అయితే చాలా కాలంగా 'రభస' చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు తాజాగా వాయిదా పడటంపై ఆగ్రహంగా ఉన్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ కాల్స్, మెసేజ్ చేస్తూ బెదిరిస్తున్నారని, సినిమాను షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయని కారణంగానే ఈ బెదిరింపులు వస్తున్నాయని బెల్లకొండ సురేష్ తెలిపారు.

Bellamkonda gets threat calls from NTR fans

మళ్లీ తనకు అలాంటి బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెల్లంకొండ అంటున్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'రభస' మొత్తానికి ఆగస్టు 29 విడుదల చేస్తామని నిర్మాత......పరిస్థితులు అనుకూలించక అప్పుడు రిలీజ్ కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? చూడాలి.

రభస చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్. మరో హీరోయిన్ ప్రణీత ముఖ్యమైన పాత్ర చేస్తోంది. తమన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు రెస్పాన్స్ బాగానే ఉంది. చాలా కాలంగా సరైన హిట్టు లేని జూ ఎన్టీఆర్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X