'గోలీమార్' తో జాతకం మారిన రోజా, సిన్మాల్లో ఇక తాజా....
"గోలీమార్" సినిమాలో రోజా పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సెకండాఫ్ లో ఒక చిన్నపిల్ల తల్లిగా ఆమె చేసిన నటన అద్భుతంగా ఉందని తొలి టాక్ సారాంశం. భారీ బడ్జెట్ తో గోపీచంద్, ప్రియమణిల కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు విడుదలైంది. రోజాకు రాజకీయాలు కలిసిరాకపోయినా సినిమా ఫీల్డ్ లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలివస్తున్నట్టే ఉంది. గోలిమార్ కలెక్షన్లు ఎలా ఉన్నా రోజాకు మాత్రం సినిమా రంగంలో మరోసారి బంగారు భవిష్యత్తు ఖాయమనిపిస్తోంది. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖరరెడ్డి కానీ ఇవ్వలేని బ్రేక్ ను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆమెకు సినిమాల్లో రెండోసారి ఇచ్చారు.
"గోలీమార్" సినిమాపై దట్స్ తెలుగు డాట్ కాం సమీక్ష
రోజా గోలీమార్ పూరీ జగన్నాధ్ గోపీచంద్ బెల్లంకొండ సురేష్ roja bellamkonda suresh puri jagannath gopichand golimaar


Click it and Unblock the Notifications