బిపాషా అంటే బెల్లంకొండకు అంతిష్టమా?

ఇదిలా ఉంటే రోమియో-జూలియట్ సినిమాలో బిపాషా చేత ఐటమ్ సాంగ్ కచ్చితంగా చేయించాలని బెల్లంకొండ సురేష్ కలలు కన్నాడు. బిపాషా అంటే సురేష్ అంత ఇష్టమట. ఆ ఐటమ్ సాంగ్ కోసం ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇలియానాకు 1కోటి, తరుణ్ కు 2 కోట్లకు పైగా ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అయిదు నిమిషాల పాట కోసం కోటి రూపాయలు వెచ్చించడమేమిటని టాలీవుడ్ గుసగుసలాడుతోంది. అశ్వనీదత్ లాంటి సీనియర్ నిర్మాతలు సైతం సురేష్ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











