బోయపాటికి... బెల్లంకొండ షాకింగ్ రెమ్యూనరేషన్
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్లో భద్ర, తులసి, సింహ, లెజెండ్ లాంటి హిట్ చిత్రాలు అందించిన ఆయన ఇపుడు టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరు. ఇలాంటి దర్శకుడయితే తన కొడుకుకు మరో హిట్ ఇవ్వొచ్చనే ఉద్దేశ్యంతో నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీనుకు భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ నెల 27న సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి గాను నిర్మాత బెల్లంకొండ సురేష్ బోయపాటికి రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ కూడా భారీ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఇంకా ఖరారు కాలేదు. పూర్తి వివరాలు త్వరలో తేలనున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు శీను'చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. 'అల్లు శీను' చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్ గా నటించగా, తమన్నా ఐటం సాంగు చేసింది. కమర్షియిల్ ఎంటర్టెనర్ కావడంతో బడ్జెట్ కాస్త ఎక్కువయినా....నిర్మాతకు పెట్టబడి తిరిగొచ్చిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











