నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ నిర్మాతతో
బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ తన తదుపరి చిత్రం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. అందుకోసం ఇద్దరు టాప్ డైరక్టర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని వినికిడి. ఈ చిత్రం పూర్తి స్ధాయి కమర్షియల్ విలువలతో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యతో బెల్లంకొండ సినమా లేటయ్యేటట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నారా రోహిత్ కూడా ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నారని అయితే అన్నీ బాణం తరహా కథలే చెప్తున్నారని రిజెక్టు చేసారని అంటున్నారు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తమిళ రీమేక్ నాడోడిగల్ ని రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్నారు. శంభో..శివ శంభో అనే టైటిల్ తో తెరకెక్కతున్న ఈ చిత్రానికి దర్శకుడు తమిళంలో ఒరిజనల్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన సముద్ర ఖని కావటం విశేషం.
నారా రోహిత్ చంద్రబాబు నాయుడు బాణం రామ్మూర్తి నాయుడు అశ్వనీదత్ బెల్లంకొండ సురేష్ రాజమౌళి వినాయిక్ రవితేజ శంభో శివ శంబో నాడోడిగల్ సముద్ర ఖని nara raohit chandra babu rammurthy naidu baana


Click it and Unblock the Notifications