సల్మాన్ ఖాన్ తో మనీ గేమ్ అడనున్న బెల్లంకొండ సురేష్
సల్మాన్ ఖాన్ ఇప్పుడు రీమేక్ రాజా గా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. తన కాంచన చిత్రం రీమేక్ తో పాటు కందిరీగ చిత్రాన్ని కూడా రీమేక్ రైట్స్ కలపి ఇచ్చి, బిజెనెస్ లో వాటా ఆడిగే ఆలోచనలో ఉన్నాడు. రెండింటికి కలిపి ఒకేసారి బేరం మొదలెట్టాడు. కాంచన చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా, సంజయ్ దత్ కీలకపాత్రగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కందిరీగ ను కూడా సల్మాన్ ఖాన్ నే చేయాలని ఆసక్తి చూపడంతో ఈ రకం వాటా అడుతున్నాడని తెలుస్తోంది. మొన్న చేసిన రెడీ రీమేక్ టాక్ బాగోలేకపోయినా ఓపినింగ్స్ అదిరిపోయాయి. దాంతో ఇక్కడ సౌత్ పరిశ్రమలో ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేస్తున్నారు.
అలా ఉన్న టైమ్ లో అతని కంట్లో తాజాగా లారెన్స్ లేటెస్ట్ చిత్రం కాంచన (ముని సీక్వెల్) పడింది. ఆ చిత్రం ట్రైలర్స్ చూసిన సల్మాన్ వెంటనే లారెన్స్ ని కాంటాక్ట్ చేసి స్క్రిప్టు పంపమన్నాట్ట. అందులోనూ లారెన్స్ కూడా ప్రభుదేవాలాగ డాన్స్ మాస్టర్ కావటం కూడా కలిసివచ్చిన అంశం. ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్, బాడీగార్డ్ రీమేక్ లలో చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ దర్శకులు టార్గెట్ సల్మాన్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతలు కూడా సల్మాన్ ఖాన్ కి ఉన్న ఈ రీమేక్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











