బెల్లకొండ-హీరో రామ్ మధ్య ఆరని చిచ్చు
'కందిరీగ" హీరో రామ్, నిర్మాత బెల్లకొండ సురేష్ మధ్య చిచ్చు రగులుతూనే ఉంది. ఈ ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం డబ్బే. కందిరీగ సినిమా చేసినందుకు గాను రామ్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా బెల్లం కొండ ఆలస్యం చేస్తూ వచ్చాడు. సినిమా విడుదలైన తర్వాత(ఇప్పడు విడుదలైంది లెండి) ప్లాప్ అయితే బెల్లకొండ తనకు ఎగనామం పెడతాడని ఊహించిన రామ్ ఈ విషయాన్ని మీడియా చెవిలో వేశాడు. దీంతో బెల్లంకొండ ఎగ్గేట్టే రకం అంటూ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారం వెనక రామ్ హస్తం ఉందని ఊహించిన బెల్లంకొండ...వెంటనే ఆ మొత్తం రామ్ కు ఇచ్చేసి, అతనికి బుద్ది చెప్పే పనిలో పడ్డాడు. కందిరీగా సినిమా ప్రముషన్లలో వీలైనంత తక్కువగా రామ్ ఉండేలా చేస్తూ..క్రెడిట్ అంతా తనకే దక్కేలా జాగత్త పడుతున్నాడు. అయితే ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లతో మంచి సంబంధాలు ఉన్న రామ్ ఒంటరిగా ఇంటర్వ్యూలకు వెలుతూ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నంలో పడ్డాడు. మరి ఈ ఇద్దరి మధ్య రేగిన డబ్బు చిచ్చు ఎప్పడు చల్లారుతుందో...


Click it and Unblock the Notifications











