'లవ్ ఫెయిల్యూర్' నుంచి దిల్ రాజు తప్పుకున్నాడు
సిద్దార్ధ తాజా చిత్రం 'లవ్ ఫెయిల్యూర్'ని మొదట దిల్ రాజు తెలుగులో రైట్స్ తీసుకుని రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సీన్ లోకి ఊహించని విధంగా బెల్లంకొండ సురేష్ ప్రత్యక్ష్యమయ్యారు. సిద్దార్దతో నందినీరెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు 'లవ్ ఫెయిల్యూర్' చిత్రాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే ఈ చిత్రం వాస్తవానికి వాలైంటైన్స్ డే కానుకగా ఈ రోజు(పిబ్రవరి 14)న విడుదల కావాల్సి ఉంది. అయితే పిబ్రవరి 17న విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని ముందుగా ప్రేక్షకులకు చూపించి కథనంలో చాలా మార్పులు చేసారు నిర్మాత, హీరో సిద్దార్ద. ఈ చిత్రంపై సిద్దార్ద చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.
చరిత్రలో విఫలమైన ప్రేమకథలన్నీ దాదాపుగా విషాదాన్నే మిగిల్చాయి. కానీ ఇది అందుకు భిన్నమైన ప్రేమకథ'లవ్ ఫెయిల్యూర్'. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ చిత్రం కథలో అమలా పౌల్ పార్వతి అనే పాత్రను పోషిస్తోంది. ఆమెకు అందం, తెలివితేటలు.. రెండూ ఎక్కువే. అందుకే ఆమెపై సిద్దార్ధ అనే కుర్రాడు మనసుపడ్డాడు. దేవదాసు తరహాలో ప్రేమించాడు. అయితే ఆమె మాత్రం కుదరదని,అలాంటివి తనకు ఇష్టం ఉండవని తేల్చి చెప్పింది. అలాంటి పరిస్దితుల్లో ఆ భగ్నప్రేమికుడు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడేదే మిగతా కథ. నవతరం ప్రేక్షకుల్ని మెప్పించేలా భావోద్వేగాలుంటాయి.
సిద్దార్ధ,అమలాపౌల్ జంటగా బాలాజీ మోహన్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం'లవ్ ఫెయిల్యూర్'. కె.వేణుగోపాల్, సిద్ధార్థ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆయన మాట్లాడుతూ...ప్రేమలో నేను చాలాసార్లు విఫలమయ్యాను. అందుకే ఈ కథలో చక్కగా ఇమిడిపోయాను. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలని భావించేవాళ్లు ఈ చిత్రాన్ని చూస్తే తప్పకుండా తగిన ఫలితం దొరుకుతుంది అంటున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిరవ్ షా, పాటలు: శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర.


Click it and Unblock the Notifications











