twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సినిమాలా ఆడాలి: వి.వి. వినాయిక్ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: వినాయిక్ దర్సకత్వంలో రూపొందిన అల్లుడు శీను చిత్రంతో పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సరైనోడు అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా జరగింది. ఇదే దర్సకుడు రూపొందించిన పవన్ కళ్యాణ్..సుస్వాగతం చిత్రంలా ఈ సినిమా ఆడాలని వచ్చిన అతిధులు కోరుకున్నారు.

    బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమనేని సునీత నిర్మాతగా భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పీడున్నోడు. డి.జె.వసంత్ సంగీతం అందించారు. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది.

    ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ అదే స్థాయిలో మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగా జరిగింది. తప్పకుండా స్పీడున్నోడు పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.

    బిగ్ సీడిని...

    బిగ్ సీడిని...

    బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేశారు.

    తమన్నా అందుకుంది

    తమన్నా అందుకుంది

    ఆడియో సీడీలను వినాయక్ విడుదల చేయగా తొలి సీడీని తమన్నా అందుకున్నారు.

    వి.వి.వినాయక్ మాట్లాడుతూ ...

    వి.వి.వినాయక్ మాట్లాడుతూ ...

    మా సాయి శ్రీనివాస్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే తన తల్లిదండ్రుల తర్వాత ఆనందపడేది నేనే. ఎందుకంటే ఇప్పటికీ సాయి నా హీరో, ట్రైలర్ చూడగానే నచ్చింది. కొన్ని సీన్స్ నేను చూశాను. శ్రీనివాస్ చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. అల్లుడు శీనులో సాయి డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడనే పేరు వచ్చింది. ఈ సినిమాలో యాక్టింగ్ బాగా చేశాడనే పేరు వస్తుంది. సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

    వినాయిక్ కంటిన్యూ చేస్తూ..

    వినాయిక్ కంటిన్యూ చేస్తూ..

    అల్రెడీ తమిళం, కన్నడ హిట్ అయిన మూవీ, హిందీలో కూడా చేస్తున్నారు. సూపర్ హిట్ కథతో భీమనేని వంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ చేస్తున్న మూవీ, భీమనేని సుస్వాగతం చేసినప్పుడు ఎంత పెద్ద హిట్టయిందో ఈ సినిమా యూత్లో అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సాయికి ఆల్ ది బెస్ట్ సాయి పెద్ద హీరో అవుతాడు. మంచి బిజినెస్ జరిగింది. బయ్యర్స్కు, యూనిట్కు ఆల్ ది బెస్ట్" అన్నారు.

    బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ....

    బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ....

    "వినాయక్ గారు నా ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉంది. వసంత్ గారు ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. తన మ్యూజిక్లో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడ్డాను. విజయ్ ఎక్సలెంట్ కెమెరావర్క్ చేశారు. అల్లుడు శీను తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా చేయాలని మనస్పూర్తిగా అనుకున్నాను.

    హాంట్ చేసింది..

    హాంట్ చేసింది..


    భీమనేనిగారు చెప్పిన కథ నన్ను హాంట్ చేసింది. ఇంత మంచి క్లయిమాక్స్ను, పెర్ఫార్మెన్స్కు హై స్కోప్ ఉన్న మూవీని వదులుకోకూడదని ఈ సినిమా చేశాను. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు భీమనేనిగారికి థాంక్స్ అన్నాడు శ్రీనివాస్.

    తమన్నా ధాంక్స్..

    తమన్నా ధాంక్స్..

    తమన్నాతో మరోసారి స్పెషల్ సాంగ్ చేసింది, తనకు థాంక్స్ . హీరోయిన్ సోనారిక బాగా యాక్ట్ చేసింది. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ గౌతంరాజు మంచి ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ తో వర్క్ చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్" అన్నారు.

    భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ....

    భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ....

    "ఒక రీమేక్ సినిమా కోసం మూడేళ్ళు కష్టపడ్డాం. వసంత్ అయితే ఈ మూడేళ్ళ నాతోనే ట్రావెల్ చేశాడు. ఈ సినిమాలో అవుట్ పుట్ బావుండాలని ఇద్దరం పోట్లాడుకునేవాళ్ళం. సుడిగాడు సినిమా తర్వాత వసంత్ కు అనుకున్నంత మంచి అవకాశాలు రాలేదు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించాను. ఈ మూడేళ్ళలో ఎన్నో ట్యూన్స్ విన్నాం. 18 సాంగ్స్ను రికార్డ్ చేశాం. వాటి నుండి 8 సాంగ్స్ సెలక్ట్ చేసి మంచి అవుట్ పుట్ రాబట్టాను.

    పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు..

    పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు..

    అలాగే ప్రవీణ్ వర్మ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. అందరూ టార్చర్ పెట్టానని అనుకున్నారు కానీ మంచి అవుట్ పుట్ కోసం తప్పలేదు. ఈ సినిమా మళ్ళీ నన్ను ఐదేళ్ళు, పదేళ్ళు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది" అని భీమినేని అన్నారు.

    కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ...

    కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ...

    "హీరో శ్రీనివాస్ లో మంచి స్పీడుంది. తన స్పీడు చూసే డైరెక్టర్ ఈ పేరు పెట్టాడని అనుకుంటున్నాను. ముఖ్యంగా క్లయిమాక్స్ లో హార్ట్టచింగ్ సీన్స్ ఉన్నాయి. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. టీంకు ఆల్ ది బెస్ట్" అన్నారు.

    పోకూరి బాబూరావు మాట్లాడుతూ..

    పోకూరి బాబూరావు మాట్లాడుతూ..

    "ఈ సినిమా తమిళంలో చాలా బాగా ఆడింది. తెలుగు నెటివిటీకి తగిన విధంగా చాలా మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా క్లయిమాక్స్
    గుండెకాయలాంటిది. ఫ్రెండ్స్ కోసం, ప్రేమ కోసం దేనికైనా తెగించే హీరోకు తగిన టైటిల్ సుడిగాడు' కంటే పెద్ద హిట్ కావాలి. వసంత్ మంచి మ్యూజిక్ అందించాడు" అన్నారు.

    బి.ఎ.రాజు మాట్లాడుతూ....

    బి.ఎ.రాజు మాట్లాడుతూ....

    "తొలి సినిమాతో నలబై కోట్లు కలెక్ట్ చేసి పెద్ద హీరో అయ్యాడు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. వరుస సక్సెస్ లు సాధిస్తున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేస్తున్న చిత్రం. బిజినెస్ కూడా చాలా స్పీడుగా ఉన్న సినిమా. రేపు కలెక్షన్స్ కూడా కూడా స్పీడు కనపడుతుంది" అన్నారు.

    విజయ్ ఉలగనాథన్ మాట్లాడుతూ....

    విజయ్ ఉలగనాథన్ మాట్లాడుతూ....

    "బెల్లంకొండ శ్రీనివాస్ లో పుల్ ఎనర్జీ ఉంది. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భీమినేని శ్రీనివాస్ గారికి థాంక్స్" అన్నారు.

    అనిల్ రావిపూడి మాట్లాడుతూ...

    అనిల్ రావిపూడి మాట్లాడుతూ...

    "సాంగ్స్ చాలా బావున్నాయి. భీమనేనిగారు స్పీడున్నాడుతో మాకు పోటీగా ఉన్నారు. హీరోలో చాలా స్పీడుంది. సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది" అన్నారు.

    బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ...

    బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ...

    "స్పీడున్నోడు తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్" అన్నారు.

    తమన్నా మాట్లాడుతూ...

    తమన్నా మాట్లాడుతూ...

    "బెల్లంకొండ శ్రీనివాస్ ఎనర్జీకి తగిన టైటిల్ ఇది. తన సెకండ్ మూవీతోనే డ్యాన్సులు పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మరో స్టెప్ ముందుకెళ్ళారు. ఈ సినిమాను చూడటానికి వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాలో బ్యాచిలర్ బాబు..సాంగ్ చేశాను" అన్నారు.

    జె.వసంత్ మాట్లాడుతూ..

    జె.వసంత్ మాట్లాడుతూ..

    "ఈ సినిమా చాలా కాలం యజ్ఞంలా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు, వివేక్ కూచిబొట్లగారికి థాంక్స్ . వారి వల్లే ఈ సినిమా చేయగలిగాం, హీరోని అందంగా చూపించారు" అన్నారు.

    రెజీనా మాట్లాడుతూ...

    రెజీనా మాట్లాడుతూ...

    "బెల్లంకొండ శ్రీనివాస్, భీమనేని శ్రీనివాసరావుగారి సహా టీం అంతటికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.

    ఈ కార్యక్రమంలో....

    ఈ కార్యక్రమంలో....

    వి.వి.వినాయక్, రకుల్ ప్రీత్సింగ్, తమన్నా, అభిషేక్పిక్చర్స్ అభిషేక్ కొండా విజయ్ కుమార్, పోకూరి బాబూరావు, చంటి అడ్డాల, బి.ఎ.రాజు, సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథన్, అనిల్రావిపూడి, హేబా పటేల్ బెక్కం వేణుగోపాల్, గౌతంరాజు, కబీర్, శ్రీనివాసరావు, లలిత్ కుమార్, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ డి.జె.వసంత్, రెజీనా కాసండ్ర, క్యాథరిన్, సాక్షిచెదరి, పూర్ణ హాసిని తదితరులు పాల్గొన్నారు.

    సినిమాలో ఎవరెవరు..

    సినిమాలో ఎవరెవరు..

    ప్రకాష్ రాజ్, రావు రమేష్ అలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, మధునందన్, చైతన్యకృష్ణ, కబీర్, సత్య అక్కల, షకలకశంకర్, రమాప్రభ, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి మెయిన్ స్టోరి: ఎస్.ఆర్.ప్రభాకరన్, డైలాగ్స్ ప్రవీణ్ వర్మ, భీమనేని శ్రీనివాసరావు, ఆర్ట్ కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: రవివర్మ, ఎడిటర్ గౌతంరాజు, మ్యూజిక్ డి.జె.వసంత్, సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల, నిర్మాత: భీమనేని సునీత, స్టోరీ డెవలప్ మెంట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

    English summary
    Speedunnodu 2016 telugu movie audio released. Movie featuring Bellamkonda Srinivas, Sonarika Bhadoria, Tamanna, Rao Ramesh, Srinivas Reddy and Fish Venkat. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X