ఛత్రపతి బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆ రేంజ్ లో ఖర్చు చేశారా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఛత్రపతి రీమేక్ ద్వారా అడుగు పెట్టారు. ఈ మూవీ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పెన్ ఇండియా ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛత్రపతి హిందీ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
భారీగా రిలీజ్ చేసిన కూడా ఏమాత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకోలేదు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం తేల్చేశారు. అతి తక్కువ రేటింగ్స్ సినిమాకి ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ముందుగా 40 నుంచి 45 కోట్ల బడ్జెట్ అనుకున్నారంట.

అయితే సినిమా కంప్లీట్ అయ్యేసరికి 80 కోట్ల వరకు మూవీకి ఖర్చయినట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ తో కలుపుకొని 85 కోట్ల బడ్జెట్ తేలినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ స్థాయిలో ఖర్చుపెట్టినా కూడా మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం బాలీవుడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది.
జీరో షేరింగ్ తో పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా ఛత్రపతి రీమేక్ ద్వారా నిర్మాత నష్టపోయినట్లే అని తెలుస్తుంది. యూట్యూబ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలకు వచ్చే వ్యూయర్షిప్ చూసుకొని నార్త్ ఇండియాలో తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని డైరెక్ట్ మూవీ చేసేసారు.
ఈ సినిమా రిజల్ట్ తో నార్త్ ఇండియన్ ఆడియన్స్ బెల్లంకొండ హీరోకి పూర్తిగా జ్ఞానోదయం కలిగించారనే మాట వినిపిస్తోంది. మొత్తానికి హిందీలో గ్రాండ్ సక్సెస్ కొట్టాలని అనుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి అలాగే దర్శకుడు వివి వినాయక్ కి ఛత్రపతి రీమేక్ ఊహించని పరాభవాన్ని మిగిల్చింది. అలాగే కొడుకుని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని ఆశపడిన బెల్లంకొండ సురేష్ కి కూడా ఈ సినిమా గట్టి ఎదురు దెబ్బ అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











