బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మన కమర్షియల్ మాస్ హీరోల డబ్బింగ్ సినిమాలకు హిందీ ఆడియెన్స్ నుంచి అయితే రెస్పాన్స్ బాగానే వస్తోంది. అయితే డైరెక్ట్ గా మన హీరోల సినిమాలు విడుదలైతే నార్త్ జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తన దృష్టిని మొత్తం బాలీవుడ్ సినిమాపైనే పెట్టాడు. ఛత్రపతి కథను బెల్లంకొండ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని బెల్లంకొండ తన దృష్టిని మొత్తం ఆ సినిమాపైనే పెడుతున్నాడు.

bellamkonda sai srinivas full focusing on bollywood

మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదట. రాక్షసుడు సినిమా కంటేముందే బెల్లంకొండ ఒక రెండు తెలుగు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు. వాటిని కూడా ఇప్పట్లో సెట్స్ పైకి తెచ్చే ఛాన్స్ లేదని సమాచారం. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు కొన్నిరోజులు వర్క్ షాప్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి ప్రభాస్ కెరీర్ కి ఒక యూ టర్న్ ఇచ్చిన ఛత్రపతి కథ బెల్లంకొండ వారసుడి జీవితాన్ని ఎంతవరకు చేంజ్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X