'గోలీమార్' గురించి ఇంకా గోల్ మాల్ అవసరమా?
మా అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న ప్రాజెక్ట్ ఇది. నిర్మాతగా నేను, మా బయ్యర్లు అందరూ ఆనందంగా ఉన్నాం అంటూ ఆనందంగా బెల్లంకొండ సురేష్..తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...మా గోలీమార్ చిత్రం బీ, సీ సెంటర్లలో మంచి ప్రేక్షకాదరణను పొందుతుందని అనుకున్నాం. అలాంటిది 'ఏ' సెంటర్లలోనూ బాగా ఆడుతోంది. తొలి వారం షేర్ మన రాష్ట్రంలో 9 కోట్లు అందింది. రెండో వారం వసూళ్ళు కూడా స్థిరంగా ఉన్నాయి. చూసిన వారే రెండు మూడు సార్లు చూశామని అంటున్నారు. ప్రియమణి, రోజా పాత్రలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. పూరి మార్కు డైలాగులు, లొకేషన్లు, శ్యామ్.కె.నాయుడు ఫొటోగ్రఫీ గురించి అందరూ పొగుడుతున్నారు. చక్రి సంగీతం యువతకు బాగా నచ్చింది. మంచి బాణీలు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఇక రెండు వారాల క్రితం రిలీజైన గోలీమార్ ని ప్లాప్ చిత్రంగా ట్రేడ్ లో తేల్చేసారు. దానికి తగ్గట్లే చాలా చోట్ల ధియోటర్స్ కూడా ఎత్తేసారు.


Click it and Unblock the Notifications











