నేను లేకపోయినా నా తమ్ముడు ఉంటాడు.. అదే నా డ్రీమ్: బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వరసుల ఎంట్రీపై నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఓ వర్గం ఆడియెన్స్ చూపు బెల్లంకొండ వారసుడిపైనే ఉంది. పెద్దోడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అతని తమ్ముడు కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ..
బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అయితే చాలా కాలంగా ఆయన తన కొడుకు శ్రీనివాస్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇక త్వరలో ఆయన తన చిన్నకుమారుడు బెల్లంకొండ గణేష్ ను కూడా వెండితెరకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు.

తమ్ముడిని కూడా అలానే..
బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వివి.వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన అల్లుడు శీను సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను క్రియేట్ చేయకపోయినప్పటికి హీరోగా మాత్రం శ్రీనివాస్ కు ఒక మంచి క్రేజ్ ను అందించింది. అలానే బెల్లంకొండ గణేష్ ను కూడా పరిచయం చేయాలని అనుకుంటున్నారు.

సినిమా మొదలైంది.. కానీ?
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు ఎంట్రీపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే పవన్ సాధినేని అనే యువ దర్శకుడి సినిమా ద్వారా బెల్లంకొండ గణేష్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పారు. లాంచ్ ఈవెంట్ ను కూడా గట్టిగానే చేశారు. కానీ సినిమా ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఇక మొదటి సినిమా విషయంలో రిస్క్ చేయకుండా ఉండాలని బెల్లంకొండ గణేష్ ఆ ప్రాజెక్టును మళ్ళీ ముట్టుకోలేదు.
Recommended Video

నేను లేకపోయినా తమ్ముడు ఉంటాడు
ఇక రీసెంట్ గా ఆ తమ్ముడి ఎంట్రీపై మాట్లాడిన శ్రీనివాస్ వచ్చే ఏడాది అతని ఎంట్రీ తప్పకుండా ఉంటుందని అదే తన బిగ్ డ్రీమ్ అని వివరణ ఇచ్చాడు. నెక్స్ట్ శ్రీనివాస్ బాలీవుడ్ ఛత్రపతి రీమేక్ తో బిజీ కానున్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ వచ్చే ఏడాది తెలుగులో నా సినిమా లేకపోయినా తప్పకుండా తమ్ముడి సినిమా ఉంటుందని కూడా వివరణ ఇచ్చాడు శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











