అల్లుడు శ్రీను-బోయపాటి న్యూ మూవీ షురూ (ఫోటోస్)
హైదరాబాద్: బోయపాటి శ్రీను హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేసారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...'అల్లుడు శ్రీను సినిమా చూసిన తర్వాత నేను తయారు చేసుకున్న కథకు బెల్లంకొడ సాయి శ్రీనివాస్ వంద శాతం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇది 'భద్ర'లాంటి సినిమా అవుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ప్యూర్ లవ్ స్టోరీ ఇది. యాక్షన్ కూడా ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రానికి హీరోయిన్, ఇతర తారాగణం ఖరారు కావాల్సి ఉంది. స్లైడ్ షోలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు,ఫోటోలు...

కొడుకుతో బెల్లంకొండ మరో భారీ బడ్జెట్
తన తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవల భారీ బడ్జెట్‌తో ‘అల్లుడు శీను' చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత బెల్లంకొండ సురేష్....ఈ సినిమాను కూడా తన బేనర్లోనే తీయాలని నిర్ణయించుకున్నాడు. బోయపాటి ఆలోచనలకు తగిన విధంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్
కథా పరంగా ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని దర్శకుడు తెలిపారు. నవంబర్ నెల మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు.

వివి వినాయక్
''శ్రీనివాస్ తొలి చిత్రం 'అల్లుడు శీను' విడుదలకు పది రోజుల ముందే బోయపాటి శ్రీనివాస్ తనకు శ్రీనివాస్ నచ్చాడని, తను హీరోగా సినిమా చేయాలనుకుంటున్నానని అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. తెలుగు పరిశ్రమలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసే దర్శకుల్లో బోయపాటి ఒకరు. శ్రీనివాస్ కి మంచి సినిమా అవుతుంది '' అని చెప్పారు.

శ్రీనివాస్ మాట్లాడుతూ
''తొలి సినిమా వీవీ వినాయక్ లాంటి దర్శకుడు, మలి చిత్రాన్ని బోయపాటి శ్రీనివాస్ వంటి దర్శకుడితో చేయడం నా అదృష్టం'' అని చెప్పారు.

క్లాప్ కొడుతున్న రాఘవేంద్రరావు
బెల్లకొండ సాయి శ్రీనివాస్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.

దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... బోయపాటితో మూడు హిట్ సినిమాలు చేశాను. ఇప్పుడు బోయపాటి తో మరో హిట్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

స్ర్కిప్టు
వివి వినాయక్ చేతుల మీదుగా స్క్రిప్టు అందుకుంటున్న బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











