అన్న నిలబడటానికే నానా తంటాలు.. హీరోగా తమ్ముడు ఎంట్రీ

సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగానే ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ఎంట్రీ ఇచ్చాక మాత్రం నిలబడాల్సింది ఎవరి కాళ్ల మీదే వారే. వెనకాల ఎంత బూస్టప్ ఇచ్చేవారు ఉన్నా, ప్రతిభ ఉన్నా, కాలం కలిసి రాకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.. చాలా ఏళ్లుగా కష్టపడి మొన్నరాక్షసుడు సినిమాతో విజయాన్నిసొంతం చేసుకున్నాడు.

బెల్లంకొండ నుంచి మరో వారసుడు

బెల్లంకొండ నుంచి మరో వారసుడు

అల్లుడు శ్రీను నుంచి రాక్షసుడు వరకు ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చాడు ఈ యంగ్ హీరో. అయితే బెల్లంకొండ నుంచి మరో వారసుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్న ఇంత కాలానికి సరైన హిట్ కొట్టాడు.. ఇక తమ్ముడిని తీసుకొచ్చాడని అంటున్నారు.

మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడిన హీరో..

మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడిన హీరో..

మాస్ ఇమేజ్ కోసం పరితపించిన బెల్లంకొండ శ్రీనివాస్.. వరుస ఫ్లాపులను చవిచూశాడు. యాక్షన్ సినిమాలు చేస్తూ.. వచ్చిన ఈ హీరో రూట్ మార్చి.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. తమిళ హిట్ మూవీ రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఆనందంలోనే తమ్ముడి ఎంట్రీని చేసేస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రేమ కథా చిత్రంతో ఎంట్రీ

ప్రేమ కథా చిత్రంతో ఎంట్రీ

బెల్లంకొండ గణేష్ .. మాస్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఓ అందమైన ప్రేమకథా చిత్రంతో తన మొదటి చిత్రాన్ని చేస్తున్నట్లు రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ సాధినేని తెరకెక్కిస్తుండగా.. లక్కీ మీడియా, బెటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

అందరికీ ఆహ్వానం..

అందరికీ ఆహ్వానం..

అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం.. అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగనున్న ఈ ఈవెంట్ కు అందరూ రావాలని కోరుకుంటున్నట్లు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X