ట్విట్టర్ రివ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఎలా ఉందంటే!
బెల్లంకొండ శ్రీనివాస్ తన మార్కెట్ పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రాలకు మంచి రెస్పాన్సే వస్తోంది. కానీ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా యాక్షన్ ప్రధానంగా ఉండే కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అలా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే కవచం. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. ఇద్దరు హీరోయిన్లు కాజల్, మెహ్రీన్ గ్లామర్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల స్పందన ఎలా ఉందొ చూద్దాం.
కాజల్ పాత్ర నిరాశకలిగించేలా
కవచం చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర పూర్తిగా నిరాశకలిగించేలా ఉంది. కాజల్ నెక్స్ట్ మూవీస్ లో అయినా మంచి పాత్రలు ఎంచుకోవాలి.
ట్విస్ట్‌లు ఎక్కువ
కవచం చిత్రంలో ట్విస్ట్ లు ఎక్కువగా ఉన్నాయి. కవచం యావరేజ్ చిత్రం.
సూపర్ హిట్
కవచం చిత్రం చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ ని మించేలా సెకండ్ హాఫ్ ఉంది. మొత్తంగా సినిమా సూపర్ హిట్.
యాక్షన్ డ్రామా
యాక్షన్ డ్రామాగా వచ్చిన కవచం చిత్రంలో కొత్తదనం ఏమిలేదు. ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం బావుంది.
మెహ్రీన్ మాత్రమే
కవచం చిత్రంలో పాజిటివ్ అంశం ఏదైనా ఉందంటే అది మెహ్రీన్ మాత్రమే. తమన్ సంగీతం బాగాలేదు. కాజల్ అగర్వాల్ పాత్ర కూడా సరిగా లేదు.
సస్పెన్స్ థ్రిల్లర్
కవచం చిత్రంలో మాస్, థ్రిల్లర్ అంశాలు చాలా బావున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో పరిణితి పెరిగింది.
పర్వాలేదనిపించే చిత్రం
ఇటీవల వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలలో కవచం పర్వాలేదనిపించే విధంగా ఉంది. సాంగ్స్, ఫైట్స్ బావున్నాయి.


Click it and Unblock the Notifications











