మరింత ఇంట్రెస్టింగ్ గా మారిన సంక్రాంతి ఫైట్.. మరో అల్లుడు కూడా రాబోతున్నాడు
అసలైన బాక్సాఫీస్ ఫైట్ మరో రెండు వారాల్లో మొదలు కాబోతోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన బూస్ట్ తో ఇండస్ట్రీలో కొందరికి ధైర్యం వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా కలెక్షన్స్ కూడా బావుండడంతో రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా దెబ్బతో కొన్ని సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇక సోలో బ్రతుకే సో బెటర్ తో ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తున్నారని చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఆ సినిమా అనంతరం సంక్రాంతి ఫైట్ పై అందరి ఫోకస్ పడింది. క్రాక్, రెడ్, బంగారు బుల్లోడు వంటి సినిమాల అనంతరం అల్లుడు అదుర్స్ అనే సినిమా కూడా రాబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

సమ్మర్ అనంతరం ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికి జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడిగా నాభా నటేష్ హీరోయిన్ గా నటించగా సోనూ సూద్ విలన్ గా నటించాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్ లో గోరేళ్ల సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా సంక్రాంతి ఫైట్ లో ఎంతవరకు వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











