డబ్బులు ఎక్కువ ఇచ్చి తమన్నాను ఒప్పించారు?

By Bojja Kumar

హైదరాబాద్: సాధారణంగా స్టార్ హీరోయన్లు కొత్తగా పరిచయం అయ్యే హీరోల సరసన చేయడానికి ఒప్పుకోరు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయంలో మాత్రం అలా జరుగలేదు. అతని తొలి సినిమాలోనే సమంత హీరోయిన్, తమన్నా ఐటం సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇందుకోసం నిర్మాతలు వారిద్దరికీ భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారు.

తాజాగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా చేయనుందని తెలుస్తోంది. తమన్నాకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఈ సినిమాక ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Bellamkonda Srinivas To Romance Tamanna In His Next

సినిమా ప్రారంభం
బోయపాటి శ్రీను హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేసారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...'అల్లుడు శ్రీను సినిమా చూసిన తర్వాత నేను తయారు చేసుకున్న కథకు బెల్లంకొడ సాయి శ్రీనివాస్ వంద శాతం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇది 'భద్ర'లాంటి సినిమా అవుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ప్యూర్ లవ్ స్టోరీ ఇది. యాక్షన్ కూడా ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X