Just In
- 9 min ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 21 min ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 1 hr ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 2 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
ప్లాస్టిక్ జెండా ఎగరేశారో ఇక అంతే.. కఠిన చర్యలు తప్పవు, కేంద్రం వార్నింగ్..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంచు బీభత్సం.. కశ్మీర్‌లో చిక్కుకున్న టాలీవుడ్ హీరో.. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వస్తాడా?
కాశ్మీర్ లో ప్రస్తుతం మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వాతావరణం చాలా భయానకంగా మారుతోంది. విమాన రాకపోకలు కూడా పూర్తిగా నికిచిపోయాయి. అయితే ఒక హీరో అనుకోకుండా కాశ్మీర్ లోనే చిక్కుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు. మన బెల్లంకొండ శ్రీనివాస్. రేపే సినిమా ప్రీ రిలీక్ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఇప్పుడు అతను వస్తాడా రాడా అనే విషయంలో పెద్ద సందేహం నెలకొంది.

అంచనాలు అయితే భారిగానే ఉన్నాయి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా గ్యాప్ తరువాత ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు అదుర్స్ అనే ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు అయితే భారిగానే ఉన్నాయి. ఈ నెలన్15న రానున్న ఈ సినిమా తప్పకుండా సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవచ్చని టాక్ వస్తోంది.
హాట్ అండ్ సెక్సీ సమంత ఫోటోలు.. బికినీలో అదరగొట్టిన బ్యూటీ

ఆ సాంగ్ కోసం కశ్మీర్ కు వెళ్లాల్సి వచ్చింది
ఇక మొన్నటివరకు కూడా చిత్ర యూనిట్ షూటింగ్ పనులతో బిజీగానే ఉంది. సంక్రాంతి సమయం దొరకడంతో చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేయాల్సి వచ్చింది. ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా దర్శకుడు తనకున్న సమయంలోనే అన్ని పనులను పూర్తి చేశాడు. ఇక ఒక్క సాంగ్ కోసమని ఇటీవల కాశ్మీర్ వెళ్లాల్సి వచ్చింది.

అక్కడే ఇరుక్కున్న బెల్లంకొండ శ్రీనివాస్
అయితే ప్రస్తుతం కాశ్మీర్ లో గ్యాప్ లేకుండా మంచు కురుస్తోంది. విమాన రాకపోకలు చాలా వరకు నిలిచిపోయాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇప్పుడు అక్కడే ఇరుక్కోవాల్సి వచ్చింది. ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసుకున్నా కూడా హైదరాబాద్ కు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అక్కడి వాతావరణం చాలా భయానకంగా మారుతోంది.

ప్రీ రిలీజ్ వేడుక రేపే..
అసలు మ్యాటర్ లోకి వస్తే శుక్రవారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఆ వేడుకతోనే సినిమాను హై లెవెల్లో ప్రమోట్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం బెల్లంకొండ కాశ్మీర్ లో చిక్కుకోవడంతో వేడుకను వాయిదా వేస్తారా లేక హీరోను తొందరగా రప్పించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.