కవచం మూవీ ప్రివ్యూ టాక్.. అమితాబ్ బచ్చన్ స్ఫూర్తిగా..

యువ హీరో బెల్లంకొండ శ్రీను, బ్యూటీ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవచం. ఈ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించగా, నవీన్ సొంటినేని నిర్మాతగా వ్యవహరించారు. వంశధార క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిన చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించాడు. మరో అందాల భామ మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్నది.

 థ్రిల్లర్‌గా కవచం కథ

థ్రిల్లర్‌గా కవచం కథ

యాక్షన్ కథా చిత్రాలతో హంగామా చేస్తున్న యువ నటుడు బెల్లంకొండ శ్రీను ప్రస్తుతం జోనర్ మార్చి చేసిన థ్రిల్లర్ సినిమా కవచం. తొలిసారి పోలీసుల పాత్రలో కనిపించారు. తనపై ఆరోపణలు వస్తే వాటిని పోలీస్ అధికారి తప్పని ఎలా నిరూపించారనే కథతో తెరకెక్కింది.

అమితాబ్ బచ్చన్ స్ఫూర్తిగా

అమితాబ్ బచ్చన్ స్ఫూర్తిగా

పోలీస్ పాత్ర నేపథ్యం కావడంతో హిందీలో అమితాబ్ పోలీస్‌గా చేసిన సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకొన్నారు. అమితాబ్ స్ఫూర్తితో కవచం సినిమాలో శ్రీను పాత్ర పేరు విజయ్‌గా మార్చారు. ఈ సినిమా కోసం శరీరాకృతిని మార్చుకొన్నాడు. బరువు పెరిగి పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.

తొలిసారి కొత్త దర్శకుడితో

తొలిసారి కొత్త దర్శకుడితో

ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్ అగ్ర దర్శకులతోనే పనిచేశారు. ఫస్ట్ టైం కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్లతో కలిసి పనిచేశారు. దృశ్యం, గోపాల గోపాల సినిమాలకు ఆయన వర్క్ చేశారు. తొలి చిత్ర దర్శకుడు అనే ఫీలింగ్ కలుగకుండా అనుభవం ఉన్న దర్శకుడిగా వ్యవహరించినట్టు హీరో శ్రీను చెప్పారు.

మార్కెట్‌కు మించి బడ్జెట్

మార్కెట్‌కు మించి బడ్జెట్

తన మార్కెట్‌కు మించి బెల్లంకొండ శ్రీను సినిమా బడ్జెట్‌ ఉంటుందనే అపవాదు ఉండేది. ఈ సినిమా కోసం జాగ్రత్తపడి పరిమితమైన బడ్జెట్‌తో కవచం రూపొందించారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్ భారీగా ఉండటంతో కవచం బడ్జెట్‌ను మించి రాబడిని సాధించే అవకాశం ఉంది. మరో రూ.10 కోట్లు వస్తే కవచం సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందనే ధీమాను చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.

కాజల్‌ అగర్వాల్‌తో

కాజల్‌ అగర్వాల్‌తో

మొదటి చిత్రం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ క్రేజీ, సీనియర్ హీరోయిన్లతోనే పనిచేశారు. అదే క్రమంలో కవచంలో కాజల్ అగర్వాల్‌తో జతకట్టారు. సినిమాకు బలంగా మారే పాత్రలో కాజల్ నటించారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోపాటు అంతర్లీనంగా లవ్ స్టోరి కూడా ఉంటుందని చెబుతున్నారు.

మెహ్రీన్ ఫిర్జాదా స్పెషల్

మెహ్రీన్ ఫిర్జాదా స్పెషల్

టాలీవుడ్ హీరోలకు లక్కీగా మారిన హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కవచంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అతిథి పాత్ర మాదిరిగా ఉండే ఇంపార్టెంట్ రోల్‌లో కనిపిస్తారు. మెహ్లీన్ గ్లామర్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు.

తమన్ మ్యూజిక్, రికార్డింగ్

తమన్ మ్యూజిక్, రికార్డింగ్

భాగమతి, అరవింద సమేత లాంటి విభిన్నమైన చిత్రాల్లో తనదైన శైలిలో మ్యూజిక్‌ను అందిస్తూ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. రిలీజ్‌కు ముందే ఆడియోకు ప్రత్యేకమైన అటెన్షన్ సొంత చేసుకొన్నది. ఈ సినిమాకు రీరికార్డింగ్ ప్లస్ అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X