twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వి.వి.వినాయక్‌ నా బిడ్డలాంటివాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : "వి.వి.వినాయక్‌ను నేను సొంత కొడుకులా భావిస్తాను. వినాయక్ ఇప్పుడు మా శ్రీనివాస్‌ను తన బిడ్డ అనుకుని ఎక్స్‌ట్రా కేర్ తీసుకుని సినిమా చేస్తున్నారు. కథ గురించి సినిమా కొంత లేట్ అయింది. కానీ బెస్ట్ కథ కుదిరింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యాక్షన్, లవ్ ప్రధానంగా సాగుతుంది. నేను శ్రీనివాస్‌ను ఇంట్లోనే కొడుకుగా చూస్తున్నాను. సెట్‌లో తను ఓ మాస్ హీరో, నేనో ప్రొడ్యూసర్‌ని అంతే. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాకే వినాయక్, ఛోటా.కె.నాయుడు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం వంటి గొప్ప టీమ్ దొరకడం అతని అదృష్టం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది. వేసవి కానుకగా విడుదల చేస్తాం'' అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

    అలాగే వినాయక్‌కి భారీ పారితోషికం చెల్లించాననీ, అందుకే తను ఈ సినిమా ఒప్పుకొన్నాడని అనుకొంటున్నారు. కానీ అదేం కాదు. వినాయక్‌ వ్యక్తిత్వాన్ని డబ్బుతో కొనలేం. ఇది మా అబ్బాయి సినిమా అని ఎప్పుడూ అనుకోలేదు. వినాయక్‌ సినిమాకి శ్రీనివాస్‌ పనికొస్తాడా? లేడా? ఆయన జోరుకి సరితూగుతాడా? లేడా? అనే కోణంలోనూ ఆలోచించాం. అన్ని విధాలా సంతృప్తి పడిన తరవాతే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాం అని తన కుమారుడుతో వివి వినాయిక్ దర్సకత్వంలో చేస్తున్న చిత్రం గురించి చెప్పుకొచ్చారు.

    ఎన్టీఆర్ సినిమా గురించి చెబుతూ "ఆది తర్వాత మా సంస్థలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ఈ సినిమాతో సంతోష్ శ్రీన్‌వాస్ పెద్ద దర్శకుల లిస్ట్‌లో తప్పక చేరుతాడు. ఫుల్ ఎనర్జీతో చేస్తున్న మంచి ఎంటర్‌టైనర్ ఇది. 'ఆది'ని విడుదల చేసిన మార్చి 28న ఈ సినిమాను కూడా విడుదల చేస్తున్నాం. 'ఆది' తర్వాత అంతటి బేస్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇంకా టైటిల్ అనుకోలేదు. సమంత, ప్రణీత కీలక పాత్రల్లో చేస్తున్నారు'' అని అన్నారు.

    ముని-3 గురించి వివరిస్తూ "ముని సినిమా చిన్న సినిమాగా విడుదలైంది. 'కాంచన'కు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. కానీ 'కాంచన' సంచలన విజయం సాధించడంతో 'ముని-3'కి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని 100శాతం రీచ్ అయ్యేలా సినిమా చేస్తున్నాం. నిత్యామీనన్ పాత్ర ఆమెకు టైలర్‌మేడ్ పాత్ర. తాప్సీ కెరీర్‌లోనూ బెస్ట్ పాత్రగా మిగులుతుంది. ఈ సినిమాను శివరాత్రికి విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఇతర ప్రాజెక్టుల గురించి చెబుతూ "త్వరలో రెండు ప్రాజెక్టులు మొదలు కానున్నాయి. నాగార్జునగారికి ఓ కథ చెప్పాం. ఫైనల్ స్టేజీలో ఉంది. మరో ప్రాజెక్ట్‌లో హీరో ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తాం'' అని అన్నారు.

    English summary
    
 Bellamkonda Suresh celebrating his birthday today. He say that VV Vinayak is his Son.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X