బెల్లంకొండ కొట్టాడంటూ దర్శకుడి ఫిర్యాదు

బెల్లంకొండ సురేష్ కి, సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని, రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్ .. వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని చెబుతున్నారు. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ కి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండకు రెమ్యునేషన్ విషయంలో శ్రీనివాస్ పట్టుబట్టడంతో పట్టరాని కోపం వచ్చే చెయ్య జారాడని చెప్పుకుంటున్నారు.
అయితే కొన్ని మీడియా వర్గాలు...ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్న చిత్రం స్క్రిప్టు సెకండాఫ్ లో మార్పులు చేయమని బెల్లంకొండ అడిగాడని దానికి శ్రీనివాస్ ఒప్పుకోకపోవటం ఈ వివాదానికి కారణమని అంటున్నాయి. హీరో రామ్ ఒప్పుకున్నాడు కాబట్టి మళ్లీ మళ్లీ స్క్రిప్టు మార్పులు చేయవద్దని శ్రీనివాస్ కోరడంతో వివాదం పెద్దదయిందని చెప్పుకుంటున్నారు. ఇక గతంలో రామ్ కి, బెల్లంకొండ సురేష్ కి మధ్య కూడా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొదట ఒప్పుకున్న రెమ్యునేషన్ ఎగ గొట్టాడని కందిరీగ విడుదల అయ్యాక రామ్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసి వసూలు చేసుకున్నారు.
గతంలోనూ ప్రియమణి వంటి వారు ఇలా రెమ్యునేషన్ విషయంలో బెల్లంకొండతో గొడవలు జరిగాయని మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. అంతేగాక సమంత డేట్స్ విషయంలోనూ బెల్లంకొండ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి మరీ కంప్లైంట్ పెట్టి ఆమె డేట్స్ తెచ్చుకుని షూట్ చేస్తున్నారు. ఇక ఇంత వివాదం జరిగాక ఆ దర్శకుడు .. బెల్లంకొండతో సినిమా చేస్తాడా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. ఈ విషయంలో రామ్ ఏ మాత్రం కలుగ చేసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











