twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్

    |

    గత కొన్ని రోజులుగా క్రాక్ డ్రిస్ట్రిబ్యూటర్ శ్రీను దిల్ రాజుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దిల్ రాజు కాదు.. కిల్ రాజు.. ఆయన మిగతా వారిని ఎదగనివ్వడు.. క్రాక్ సినిమాను తొక్కేస్తున్నాడు.. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా నాకు థియేటర్లు ఇవ్వడం లేదు.. కావాలనే తగ్గిస్తున్నారంటూ దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు డిస్ట్రిబ్యూటర్ శ్రీను. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ.. దిల్ రాజుకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఇదే వివాదంపై బెల్లంకొండ సురేష్ స్పందించాడు.

    ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

     అర్హత లేదు..

    అర్హత లేదు..

    అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్‌లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. మేం 15న రిలీజ్ అనుకుని మళ్లీ 14 అని చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. కానీ క్రాక్ నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా?? ఆయనకి ఆ అర్హత లేదు.. శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

    ఎంత డబ్బు కావాలంటే..

    ఎంత డబ్బు కావాలంటే..

    దిల్ రాజుతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారంటూ బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చాడు.

    వ్యవస్థే నాశనం

    వ్యవస్థే నాశనం

    ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేదంటూ వారిని ఆకాశానికెత్తేశాడు బెల్లంకొండ సురేష్.

    జీఎస్టీ కూడా కట్టలేదు..

    జీఎస్టీ కూడా కట్టలేదు..

    క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడంటూ బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యాడు.

    డబ్బు ఎక్కడికి పోదు..

    డబ్బు ఎక్కడికి పోదు..

    ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. సునీల్ నారంగ్ వంటి వాళ్లు ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. క్రాక్ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుందని బెల్లకొండ సురేష్ కామెంట్స్ చేశాడు.

    English summary
    Bellamkonda Suresh Comments On Krack Distributor Srinu About Dil raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X