twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ తో తేడా డైరక్టర్ చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరస ప్లాపులు ఇస్తున్న మంచు మనోజ్ మరో చిత్రం కమిటయ్యారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఆ చిత్రం తెరకెక్కనుంది. వీడు తేడా చిత్రంతో పరిచయమైన చిన్ని కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. మొదట ఈ చిత్రాన్ని సునీల్ తో అనుకున్నారు. కానీ డేట్స్ ఇబ్బంది అవటంతో మంచు మనోజ్ తో చిత్రం కమిటైనట్లు సమాచారం. త్వరలో సెట్స్‌కెళ్లనున్న ఈ చిత్రానికి కథ రెడీ అయిందని దర్శకుడు తెలిపారు.

    ' సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు...సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు... అంటూ 'కొత్త బంగారులోకం' చిత్రంలో, 'ఇట్స్ నాట్ ఎ వాటర్ డ్రింకు స్లోలీ.. అంటూ 'అదుర్స్' చిత్రంలో తనదైన డైలాగ్ డెలివరీతో నటుడిగా ఆకట్టుకున్న చిన్నికృష్ణ 'వీడు తేడా' చిత్రంతో దర్శకుడిగా మారాడు. నిఖిల్ పూజా బోస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కళ్యాణ్ చక్రవర్తి, సందీప్ నిర్మించారు. ఆ మద్యన విడుదలైన ఈ చిత్రం దర్శకుడుగా మంచి పేరునే తెచ్చిపెట్టింది.

    చిన్ని కృష్ణ మాట్లాడుతూ... సినిమా అంటే చిన్నతనం నుంచి వల్లమాలిన అభిమానం. ఆ అభిమానం వల్లే వైజాగ్‌లో స్టేజ్ నాటకాలకు కథలు అందించే వాణ్ణి. సినిమా అంటూ తీస్తే జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ తరహాలో ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలని వుండేది. అందుకే నిఖిల్‌తో ఫుల్‌పూంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'వీడు తేడా' చిత్రాన్ని రూపొందించాను. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

    అలాగే నా జీవితంలో వినాయక్ గారి ప్రోత్సాహం మరువలేనిది. దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వ శాఖలో 'లక్ష్మీ' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన 'కృష్ణ, అదుర్స్' చిత్రాలకు పనిచేశాను. ఆ అనుభవంతోనే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకొని నా దగ్గర వున్న 'వీడు తేడా' కథను మొదట మా గురువు వినాయక్‌కు చెప్పాను. కథ విన్న తర్వాత ఆయన ఈ కథకు నిఖిల్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అన్నారు. అంతే కాకుండా కథలో కొన్ని మార్పులు కూడా చెప్పడం జరిగింది. ఆ చిత్రం విజయం సాధించింది అన్నారు.

    English summary
    Manchu Manoj's next film will be directed by Veedu teda Director Chinni Krishna. Bellamkonda suresh is producing the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X