For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాక్షసుడు బ్లాక్‌బస్టర్‌తో.. నిర్మాత బెల్లంకొండ సురేష్ సెన్సేషనల్‌‌గా.. ఏం చేశారంటే!

|

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఏ స్టూడియోస్‌, ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందిన చిత్రం రాక్షసుడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడారు.

 అప్పట్లో అల్లుడు శీను సెన్సేషనల్ హిట్

అప్పట్లో అల్లుడు శీను సెన్సేషనల్ హిట్

అల్లుడు శీను`.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్‌ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది`` అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు.

 మరే సినిమా ఆనందాన్ని ఇవ్వలేదని

మరే సినిమా ఆనందాన్ని ఇవ్వలేదని

`నేను నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి 21 ఏళ్లవుతుంది. 25 స్ట్రయిట్ సినిమాలు, 8 డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాను. ఇవేవీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ఆరు సినిమాలు ఓ ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శనివారం 85 శాతం అక్యుపెన్సీ ఉండగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ ఉండింది. కొనేరు సత్యనారాయణగారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు.

 రమేశ్ వర్మ అద్బుతంగా తీశాడని

రమేశ్ వర్మ అద్బుతంగా తీశాడని

ప్రస్తుతం ఓ సినిమాను రీమేక్ చేసి హిట్ సాధించడం చాలా కష్టం. రమేశ్ వర్మ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేయకుండా అద్భుతంగా తెరకెక్కించారు. టెంపోను ఎక్కడా మిస్ కాలేదు. కెమెరామెన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. శ్రీనివాస్‌ను చాలా హ్యాండ్‌సమ్‌గా చూపించారు. మా అబ్బాయి గత చిత్రాలను మరచిపోయేలా ఈ సినిమా ఉంది.

జర్నలిస్టుల కోసం రూ.10 లక్షలు విరాళం

జర్నలిస్టుల కోసం రూ.10 లక్షలు విరాళం

రాక్షసుడు సినిమా విషయానికి వస్తే కొనేరు సత్యనారాయణగారు, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామాగారు సినిమాను భారీగా రిలీజ్ చేశారు. రమేశ్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 100 స్క్రీన్స్‌ వేశారు. అప్పుడు సాంబయ్య సినిమాకు ఎలాగైతే నన్ను ప్రేక్షకులు ఆదరించారో.. ఇప్పుడు మా అబ్బాయిని అలా ఆదరిస్తున్నారు. సోమవారం రోజున కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నుండి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

English summary
Sai Srinivas Bellamkonda new movie Rakshasudu. Recently this movie teaser released and created new expectations on this movie. Now today this movie released worldwide.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more