బెల్లంకొండ సురేష్ కి 'బస్‌స్టాప్'లో ఏం నచ్చింది?
దర్శకుడు మాట్లాడుతూ ''మనం ఏ బస్సు ఎక్కాలో మన గమ్యస్థానమే నిర్ణయిస్తుంది. కానీ వాళ్లు మాత్రం అలా కాదు. అందమైన అమ్మాయిలు బస్సులలో ఉంటే... బోరబండ వెళ్లవల్సినవాడు కూడా బందరు బస్సెక్కేస్తారు. ఇలా ఆ కుర్రాళ్లు తమ జీవితాల్లో సగం బస్సుల్లోనే గడిపేశారు. ఇంతకీ ఎవరు ఏ గమ్యానికి చేరారో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. నేను ఎలాంటి సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడతానో, అలాంటి కథలనే సినిమాలుగా తీస్తా. బస్‌స్టాప్‌ల్లోనే కాలక్షేపం చేసేసే కుర్రాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. ఈ నెల 13న పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.
''నేను నిర్మాతయ్యాక కథ వినకుండా చేసిన తొలి సినిమా ఇదే. కేవలం మారుతి మీద నమ్మకంతోనే ఈ చిత్రం చేశా'' అని నిర్మాత బెల్లంకొండ సురేష్ నమ్మకం వ్యక్తం చేసారు. చాలా కలర్‌ఫుల్‌గా ఈ చిత్రం రూపొందిందని హీరో హీరోయిన్లు ప్రిన్స్, శ్రీదివ్య చెప్పారు. హాసిక, గోపాల్‌సాయి, రావు రమేష్, శ్రీను, డి.ఎం.కె, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి. డ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాత: బి. మహేంద్రబాబు. ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, కొరియోగ్రఫీ: రఘు, సతీశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.


Click it and Unblock the Notifications












