బెల్లంకొండకు ఫిల్మ్ ఛాంబర్ ఫైన్
కాంచన చిత్రం విజయంతో మాంచి ఊపుమీదున్న బెల్లంకొండ సురేష్ కి ఎపి ఫిల్మ్ ఛాంబర్ ఫైన్ వేసినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్ రూల్ ప్రకారం ఏ నిర్మాత కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రాకుండా రిలీజ్ డేట్ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు. కానీ ఆ రూల్ ని బ్రేక్ చేసి కందిరీగ చిత్రం విడుదల తేది పోస్టర్స్ ని విడుదల చేసాడు. దాంతో ఫిల్మ్ ఛాంబర్ వారు ఆయనకు నోటీసులు పంపి ఫైన్ కట్టించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక సంతోష్ శ్రీన్‌వాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్, హన్సిక, అక్ష కాంబినేషన్‌లో మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ" ఈ నెల 12న విడుదల కానుంది. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ఇందులో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా చేశాడు. దర్శకుడు సినిమాని బాగా తీశాడు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











