బెల్లంకొండ సురేష్, రవితేజ చిత్రం కాన్సిల్
రవితేజ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా కందిరీగ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం కాన్సిల్ అయినట్లు సమాచారం. కారణాలు ఏమైనా బెల్లంకొండ నిర్మాతగా ఈ చిత్రం చేయటం లేదని సమాచారం. ఇక రవితేజ,కృష్ణవంశి ఓ ప్రెవేట్ గెస్ట్ హౌస్ లో శనివారం(జనవరి 9) బెల్లంకొండకు సంభందం లేకుండా ఈ చిత్రం పూజ చేసారు. ఇక ఈ మధ్య కాలంలో బెల్లంకొండ సురేష్ సినిమా ప్రకటించి ఆపుచేయటం ఇది రెండో సారి. బాలకృష్ణ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో భీష్మ అనే చిత్రం పూజ చేసి ఆపుచేసారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం గురించి లేటు చేస్తున్నారనే కృష్ణవంశి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినపడుతోంది. కృష్ణవంశి, రవితేజ తో కలిసి నో చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక బెల్లంకొండ నిర్మాతగా రవితేజ హీరోగా చేసిన శంభో శివ శంభో చిత్రం సంక్రాంతి కి రిలీజ్ అవుతోంది. తమిళ నాడోడిగల్ రీమేక్ ఇది. ఒరిజనల్ చిత్రం డైరక్ట్ చేసిన సముద్ర ఖని ఈ చిత్రానికి కూడా దర్శకుడు.


Click it and Unblock the Notifications











