twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ వాయిదాకి బెల్లంకొండ సురేష్ రిక్వెస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ 'బ్రదర్స్‌'చిత్రం విడుదలను వాయిదా వెయ్యిమంటూ ఆ చిత్రం హీరో సూర్యని రిక్వెస్ట్ చేసారు. సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'బ్రదర్స్‌'. కాజల్‌ హీరోయిన్ గా కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు. హారిస్‌ జైరాజ్‌ సంగీతం రోఅందించిన ఈ చిత్రంలోని గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఇలా రిక్వెస్ట్ చేసారు.

    ఎందుకంటే 'బ్రదర్స్‌' చిత్రం విడుదలని అక్టోబర్ 12 న పెట్టారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకే రోజు ఈ చిత్రం విడుదల అవుతోంది. అయితే అంతకుముందు అంటే అక్టోబర్ 11 న నాగార్జున హీరోగా చేసిన ఢమురకం విడుదల కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 18న భారీగా వచ్చేస్తోంది. ఈ నేపధ్యంలో ఓ డబ్బింగ్ సినిమాను ఎంత పెద్ద హీరోది వేసినా బిజినెస్ పరంగా,ధియోటర్స్ పరంగా ఇబ్బందులు తప్పవు. దాంతో బెల్లంకొండ ఈ రిక్వెస్ట్ చేసారు. అయితే నిర్మాతలు దీనిపై ఏమీ స్పందించలేదు.

    ఇక 'బ్రదర్స్‌' తొలి సీడీని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. సూర్య స్వీకరించారు. అనంతరం వినాయక్‌ మాట్లాడుతూ ''దక్షిణాదిన మనకున్న మంచి హీరోల్లో సూర్య ఒకరు. అన్ని రకాల పాత్రలకూ జీవంపోస్తారు. ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులకూ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. కె.వి.ఆనంద్‌ నా అభిమాన దర్శకుడు. ఈ చిత్రం నిర్మాత సురేష్‌కి మరో విజయాన్నిస్తుంది'' అని ఆకాంక్షించారు.

    సూర్య మాట్లాడుతూ ''అవిభక్త కవలలుగా ఎలా నటించానో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తమ్ముడు కార్తి తన సినిమాలతో చాలా బిజీగా ఉంటాడు. అయినా.. నేను పోషించిన రెండు పాత్రల్లో ఒకదానికి డబ్బింగ్‌ చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది'' అన్నారు. కార్తి చిత్రం గురించి చెబుతూ ''ఈ సినిమా చూస్తున్నప్పుడు... నేనూ, అన్నయ్య ఇలా పుట్టుంటే బాగుండేదనిపించింది. అన్నయ్యకి డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టం. తన నటన అంత భిన్నంగా ఉంటుంది'' అన్నారు.

    ''శివాజీ సినిమాలోని ఒక పాట చిత్రీకరించి వస్తున్నప్పుడు అవిభక్త కవలల గురించి ఒక పత్రికలో చదివా. ఆ స్ఫూర్తితో అల్లుకొన్న కథ ఇది. ఇందులో ఒక సూర్య వినోదం పండిస్తే, మరో సూర్య అన్నిరకాల భావోద్వేగాల్ని పండిస్తారు. ఛాయాగ్రాహకుడిగా షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌బచ్చన్‌లాంటి నటులతో పనిచేశాను. కానీ సూర్యతో పనిచేయడం మాత్రం ప్రత్యేకం'' అన్నారు దర్శకుడు. ''తెలుగులో టాప్‌ టెన్‌ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందనే నమ్మకం నాకుంది. ఓ ప్రభంజనంలా విడుదల చేయాలనుకొంటున్నామ''న్నారు బెల్లంకొండ సురేష్‌. ఈ కార్యక్రమంలో కోన వెంకట్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, డాలీ, మారుతీ, జ్ఞానవేల్‌రాజా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Bellamkonda Suresh requested Surya and Studio Green Gnanavel Raja to postpone Broters film. Brothers is being planned to release it on October 12th along with the Tamil version, Maatran, simultaneously. But Bellamkonda wants the movie to be postponed to a later date since other Telugu biggie Damarukam is releasing on October 11th and Cameraman Gangatho Rambabu is coming on Oct 18th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X