పవన్ కళ్యాణ్ తో బెల్లం కొండ సురేష్
{image-pawan kalyan_23042008.jpg telugu.filmibeat.com}నా ఆటోగ్రాఫ్ , చెన్నకేశవ రెడ్డి, లక్ష్మి నరసింహ, శివాజి, భలే దొంగలు వంటి అనేక భారీ సినిమాలకు నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించిన వ్యక్తి బెల్లంకొండ సురేష్. ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. దాని నిమిత్తం అల్లు అరవింద్ ని కలవటం స్టోరి లైన్ వినిపించటం జరిగిందిట. అరవింద్ వెంటనే పవన్ తరుపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పులి సినిమా తరువాత ప్లాన్ చేసుకోమన్నాడట.
పవన్ ప్రస్తుతం 'జల్సా' మూడ్ నుంచి బయటకు వస్తూ 'ఖుషి' డైరక్టర్ సూర్యా తో చేయబోతున్న పులి స్ర్కిప్టు వర్కులో ఉన్నాడట. పులి తరువాత ఆర్.బి.చౌదిరి కి డేట్స్ ఇచ్చాడట. మరి ఈ రెండు సినిమాలకి ఒకోసారి డేట్స్ ఎలా ఎడ్జెస్ట్ చేస్తాడో అని పరిశ్రమలో వాళ్ళు ఆలోచనలో పడుతున్నారు. అభిమానులు మాత్రం దర్శకుడుగా బెల్లంకొండ ఎవరిని తీసుకుంటాడా అని అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











