twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెండు అప్పారావు రిలీజ్ డేట్

    By Srikanya
    |

    అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా ఇవివి దర్శకత్వంలో రూపొందిన బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం ఈ నెల 16న విడుదల చేస్తున్నారు.ఇక ఈ చిత్రం లో కథ గురించి చెబుతూ ఇవివి ...అప్పారావు గోదారి గట్టున ఉన్న ఓ పల్లెటూళ్లోని ఆర్‌ఎమ్‌పీ డాక్టర్‌. తెలిసిన వైద్యం పిసరంత... హడావిడి మాత్రం కావల్సినంత. అప్పారావు అదృష్టమో... వూళ్లోవాళ్ల గ్రహపాటోగానీ... అక్కడ ఎవరికి ఏ రోగమొచ్చినా అతని దగ్గరకే రావాలి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమన్నట్లు తనకు తెలిసిన మాత్రలో, ఇంజక్షన్లో చేసేస్తూ పబ్బం గడిపేస్తాడు. అయితేనేం హస్తవాసి ఉన్న డాక్టరని పేరు. ఆ వూళ్లోని రాజుగారమ్మాయితో ప్రేమాయణం సాగిస్తుంటాడు. చివరాఖరికి ఆ వూళ్లోని ఓ పంతులమ్మని పెళ్లి చేసుకోవల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడేమైందన్నదే అసలు కథ. నరేష్‌ డాక్టరు పాత్రకి ప్రాణం పోశాడు. ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం ఇవివి దర్శకత్వం వహిస్తున్న 49వ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X