బెనిఫిట్ షో లలోనూ 'బిజినెస్ మ్యాన్' రికార్డు
మహేష్ తాజా చిత్రం ప్రతీ విషయంలోనూ రికార్డుని క్రియేట్ చేస్తూ విడుదలకు సిద్దపడుతోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డుని నమోదు చెయ్యబోతోందని తెలిసింది. ఈ చిత్రం విడుదల రోజు అంటే జనవరి 13న హైదరాబాద్ లో ఇరవై ఎనిమిది కి పైగా ధియేటర్స్ లో బెనిఫిట్ షోలు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకూ హైదరాబాద్ లో ఇన్ని ధియోటర్స్ లో బెనిఫిట్ షోలు వేయలేదని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం 1600 థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ రోజు నుంచే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ముఖ్యంగా నైజాంలో రెండు వందల యాభై ప్రింట్లు వేస్తున్నారు. అందులో హైదరాబాద్ లోనే తొంభై ధియోటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రంలో.. 'పోకిరి' తరహా డైలాగ్‌లు మాత్రం వుండవు. ఈ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. థియేటర్లు సర్దుబాటు కానందున తమిళ, మళయాల భాషల్లో ఈ చిత్రాన్ని 15 రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అలాగే... మహేష్‌ని తప్ప సినిమాలో మరెవరినీ చూడలేం. వినోదం కూడా అతని క్యారక్టర్ ద్వారానే ఉంటుంది. బ్రహ్మానందం, అలీ వంటి కమేడియన్స్ లేరు.


Click it and Unblock the Notifications











