twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ హీరోయిన్‌ రేప్.. వీడియోలు తీసి బెదిరింపులు.. బాధితురాలి ఫిర్యాదుతో

    |

    కోటి ఆశలతో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన యువ హీరోయిన్‌కు దారుణమైన చేదు అనుభవం ఎదురైంది. తాను నమ్మిన వ్యక్తి వంచనకు పాల్పడటంతో జీవితంలో సరిద్దిద్దుకోలేని మోసానికి గురైంది. తన నివాసంలో ఎవరూలేని సమయంలో హీరోయిన్‌ను సన్నిహితుడు అత్యాచారం చేశారు. ఈ ఘటన బెంగాల్ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. జాదవ్ పూర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివారాల్లోకి వెళితే..

    రేప్‌కు గురైనట్టు ఫిర్యాదు

    రేప్‌కు గురైనట్టు ఫిర్యాదు

    పోలీసుల కథనం ప్రకారం.. ఇప్పుడిప్పుడే పలు ఆఫర్లతో గుర్తింపు తెచ్చుకొంటున్న ఓ యువ నటి (26 సంవత్సరాలు) మానభంగానికి గురైంది. ఆమె పలు టెలివిజన్ షోలలో హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరించారు. ఇటీవల సాత్ భాయ్ చంపా అనే చిత్రంలో మంచి గ్లామరస్‌ రోల్‌తో ఆకట్టుకొన్నారు. తనను ఓ వ్యక్తి రేప్ చేశారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు అందుకొని తాము ఆమె వైద్య పరీక్షలకు పంపించాం అని తెలిపారు.

    ఆర్థిక సహాయం చేయమని కోరుతూ...

    ఆర్థిక సహాయం చేయమని కోరుతూ...

    యువ హీరోయిన్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు సన్నిహితంగా వ్యవహరించే వారే. ఆర్థిక సహాయం చేయమని జూలై 5న ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఎవరూ లేనిది చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమెను వివస్త్రను చేసి వీడియో షూట్ చేశాడు. పోలీస్ కంప్లయింట్ ఇస్తే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించాడు అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

    ధైర్యంగా ఫిర్యాదు చేసి

    ధైర్యంగా ఫిర్యాదు చేసి

    తనపై జరిగిన దారుణాన్ని ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు యువతార ఫిర్యాదు చేశారు. తనను బెదిరించినా.. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. యువ తార ఫిర్యాదు అందుకొని జాదవ్‌పూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అగంతకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

    అత్యాచార నిందితుడితో సన్నిహితంగా

    అత్యాచార నిందితుడితో సన్నిహితంగా

    యువ తార నాదియా ప్రాంతానికి చెందిన యువతి. యాక్టింగ్, మోడలింగ్‌ను వృత్తి ఎంచుకొని కోల్‌కతాలో ఉంటున్నారు. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కొన్ని సమస్యలు తలెత్తడంతో వారిద్దరి కొంతకాలంగా మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నారు.

    Recommended Video

    Tollywood యాక్టర్లు జాగ్రత్తలు పాటిస్తూ ఎలా షూటింగ్ చేస్తున్నారో చూడండి..!!
    పీకల్లోతు కష్టాల్లో ఉన్నానంటూ నమ్మించి

    పీకల్లోతు కష్టాల్లో ఉన్నానంటూ నమ్మించి


    లాక్‌డౌన్ సమయంలో ఫేస్‌బుక్ ద్వారా ఆమెతో సంభాషించి.. ఆమెను కలువాలుందని చెప్పారు. ప్రస్తుతం వ్యాపారంలో నష్టం రావడంతో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోఉన్నాను. కొంత ఆర్థిక సహాయం చేయమని అడిగితే కలిసేందుకు యువ తార అంగీకరించారు. ఆ సమయంలో తనను కలువడానికి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే విషయం సన్నిహితులు ద్వారా వెలుగులోకి వచ్చింది.

    English summary
    26 years Bengal Actress raped on July 5th in Kolkata. She files complaint in Jadhavpur Police station stating rape allegations. Then Police sent actress for Medical examination and investigating the case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X