»   » ‘బెంగాల్ టైగర్’ 100% హిట్టు కాదంటున్నాడు...

‘బెంగాల్ టైగర్’ 100% హిట్టు కాదంటున్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ర‌వితేజ హీరోగా సంప‌త్ నంది తెర‌కెక్కించిన ‘బెంగాల్ టైగర్' ఈ నెల 10న విడుదలకు సిద్దమవుతోంది. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందించారు. ఆడియోకు మంచి స్పంద‌న ల‌భించ‌డంతో ప్లాటినం డిస్క్ వేడుక‌ కూడా నిర్వహించారు.

ఇటీవలే ఈ సినిమాను యూనిట్ సభ్యులంతా కలిసి వీక్షించారు. వారిలో ఒకరైన సంగీత దర్శకుడు భీమ్స్ స్పందిస్తూ ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్ ల‌తో, స‌రికొత్త స్ర్కీన్ ప్లేతో మూవీ చాలా బాగుంది. ఖ‌చ్చితంగా బెంగాల్ టైగ‌ర్ 100% హిట్ కాదు 101% హిట్ అని అంటున్నారు.

Bengal Tiger is not 100% hit, It is 101% hit

రవితేజ, తమన్నా, రాశి ఖన్నా ముఖ్య తారాగణంగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు.

ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

English summary
"Bengal Tiger is not 100% hit, It is 101% hit" said misic director Bheems.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu